తెలంగాణ

డిండి ఎత్తిపోతలపై ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 24: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరందించే ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం పనులపై రాష్ట్ర ప్రభుత్వం నుండి కొరవడిన ప్రత్యేక దృష్టి పథకం పనుల పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 10వేల కోట్ల నిధుల్ని మంజూరు చేశామని ఇందుకు త్వరలోనే ఒప్పందం చేసుకుంటామని ప్రకటించగా, ఈ నిధుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతలకు కేటాయింపులను ప్రస్తావించలేదు. ప్రభుత్వ తీరుతో డిండి ఎత్తిపోతలకు నిధుల కేటాయింపులపై గందరగోళం కొనసాగుతుండగానే తాజాగా సీఎం కేసీఆర్ శుక్రవారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో ఈ ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టులతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సైతం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకం పనులు, నిధుల పట్ల సీఎం కేసీఆర్ నుండి నిర్ధిష్టమైన ప్రకటనలు వెలువడకపోవడం జిల్లా రైతాంగాన్ని నిరాశరపరిచింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో 3లక్షల 40వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో డిండి ఎత్తిపోతల పథకానికి డిజైన్ చేశారు. 6,190కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల ద్వారా పాలమూరు-రంగారెడ్డి పథకంలో భాగమైన నార్లాపూర్ నుండి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీల వరద జలాలను డిండి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి అక్కడి నుండి కాలువలు, సొరంగ మార్గాల ద్వారా జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నల్లగొండ రిజర్వాయర్‌లకు సాగునీరందించాలని నిర్ధేశించారు. 2015 జూన్ 12న డిండి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ జిల్లాలోని మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్ వద్ద శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ డిండి ఎత్తిపోతల పథకాన్ని రెండున్నర మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికి ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ సైతం పూర్తి కాలేదు. డిండి ఎత్తిపోతలకు ఎక్కడి నుండి నీరు తీసుకోవాలన్న దానిపైనే ఏడాదిన్నర సమయం పట్టగా చివరకు నార్లాపూర్ నుండి తీసుకోవాలని నిర్ణయించారు. పథకంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సింగరాజుపల్లి రిజర్వాయర్ (0.81టీఎంసీ), కిష్టరాయినిపల్లి (5.686), గొట్టిముక్కల (1.8), చింతపల్లి (1.1), చర్లగూడెం (శివన్నగూడెం-11.968) రిజర్వాయర్‌లను పనులను రూ.3,900 కోట్లతో చేపట్టారు. సదరు ఐదు రిజర్వాయర్‌లు, కాలువలకు కలిపి 9వేల ఎకరాల మేరకు భూసేకరణ చేయాల్సి వుండగా ఆరువేల ఐదువందల ఎకరాలు మాత్రమే సేకరించారు. భూసేకరణలో భాగంగా రూ.358 కోట్లు చెల్లించగా, మరో రెండున్నర వేల ఎకరాలకు పరిహార చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు డిండి ఎత్తిపోతల పథకంలో మరో మూడు రిజర్వాయర్‌ల సంఖ్య పెంచి ఆయకట్టును మరో 70వేలకు పెంచారు. అప్పటికే చేపట్టిన రిజర్వాయర్ల పనులు, భూసేకరణలకు రూ.960 కోట్లకు పైగా ఖర్చు చేశారు. నిధుల కొరత కారణంగా భూసేకరణ ప్రక్రియ, రిజర్వాయర్‌ల పనులు ముందుకు సాగడం లేదు. పరిహారం పెంచాలని రైతులు పనులకు అడ్డుపడుతుండగా, బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. ఈ నేపధ్యంలో డిండి ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రతిష్టంభన నెలకొనగా దీనిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించి పనుల్లో వేగం పెంచాలని ఈ ప్రాంత రైతులు ఆశిస్తున్నారు. ఇదిఇలా ఉండగా జిల్లాలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిండి ఎత్తిపోతల పథకం, ఎస్‌ఎల్‌బీసీ, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాల పట్ల ప్రభుత్వం ఉదాసీనత చూపుతుందని ఉద్యమాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈనెల 26 నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో డిండి ఎత్తిపోతల పథకం పనులు ప్రస్తుతం రాజకీయంగానూ ప్రాధాన్యనత సంతరించుకోగా ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
చిత్రాలు.. నిలిచిన కిష్టరాయినపల్లి రిజర్వాయర్ పనులు
*డిండి ప్రాజెక్టు రిజర్వాయర్