ఆంధ్రప్రదేశ్‌

వరద బాధితులకు కాలం చెల్లిన వంటనూనె ప్యాకెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి: గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో ముంపునకు గురైన లంక గ్రామాల్లో వరద బాధితులకు కాలం చెల్లిన వంటనూనె ప్యాకెట్లను రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు శనివారం పంపిణీచేశారు. వీటిని గుర్తించిన బాధితులు మండిపడుతూ నిలదీయటంతో అధికారులు నాలుక కరుచుకొని అప్పటికప్పుడే కొత్తప్యాకెట్లు తీసుకువచ్చి పంపిణీ చేశారు. ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల్లో తెనాలి డివిజన్ పరిధిలోని కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాలకు చెందిన సుమారు 14 లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకునే నిమిత్తం కందిపప్పు, బియ్యం, పామాయిల్‌ను నేరుగా జిల్లా పౌరసరఫరాల కేంద్రం గోదాము నుండి ప్యాకింగ్ ద్వారా, అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు స్థానిక మార్కెట్లలో కొనుగోలుచేసి బాధితులకు అందజేస్తోంది. ఈ క్రమంలో శనివారం కొల్లూరు మండలం పెదలంక, చింతల్లంక గ్రామాలలోవరద బాధితులకు మండల రెవెన్యూ అధికారులు అందించిన పామాయిల్ ప్యాకెట్లు గత జూలై 16వ తేదీతో కాలం చెల్లిపోగా తేదీని గమనించని అధికారులు పంపిణీచేసి చేతులు దులుపుకున్నారు.
అయితే అధికారులు అందించిన సరుకులను గృహాలకు తీసుకువెళ్ళిన బాధితులు ప్యాకింగ్ సరుకులు విప్పిచూసుకోగా అందులో కాలంచెల్లిన నూనె ప్యాకెట్లు ఉండటంతో అవాక్కయ్యారు. దీంతో ఆగ్రహించిన బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తూ తమ ఆరోగ్యాలతో చెలగాటమాడతారా...అంటూ అధికారులను నిలదీశారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన తమకు ఇటువంటి సరుకులు అంటగట్టి క్షోభకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ స్థానిక అధికారులు విషయాన్ని గుట్టుచప్పుడుగా ఉంచుతూ రెండు మూడు ప్యాకెట్లు ఏవో పొరపాటున వచ్చాయంటూ నచ్చజెప్పేప్రయత్నం చేశారు. ఈలోగా స్థానికులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణమే స్పందించిన మండల తహశీల్దార్ జాన్ పీటర్, రెవెన్యూ అధికారులు కాలంచెల్లిన నూనె ప్యాకెట్టు సేకరించి తిరిగి కొత్తవి ఇవ్వటంతో సమస్య సద్దుమణిగింది. సమాచారం అందుకున్న తెనాలి ఆర్డీఓ శ్యామ్‌ప్రసాద్ గ్రామాలకు చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. అయితే అధికారులు పంపిణీ చేసిన నూనె ప్యాకెట్లను ఎవరూ వినియోగించక పోవడంతో ప్రమాదం తప్పింది.
చిత్రం...వరద బాధితులకు పంపిణీ చేసిన కాలం చెల్లిన నూనె ప్యాకెట్