తెలంగాణ

ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: హైదరాబాద్‌తో సహా రాష్టమ్రంతా విష జ్వరాలు వ్యాపించాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ విమర్శించింది. శనివారం ఇక్కడ టీపీసీసీ నేత సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మృగ్యమయ్యాయన్నారు.
డెంగ్యూ, మలేరియా, ఇతర విష జ్వరాలతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ వరకు 1687 డెంగ్యూ జ్వరాలు నమోదయ్యాయన్నారు. మూడు లక్షల మంది గత మూడు నెలల్లో జ్వరాల బారినపడ్డారన్నారు.డయేరియా బారిన 86826 మంది అనారోగ్యం పాలైనట్లు నివేదికలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీ విధించాలన్నారు. వైద్య ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఒక్క సమీక్ష నిర్వహించలేదన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోవడంలేదన్నారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్య సహాయం అందించేందుకు మందులు లేవన్నారు. కొన్ని చోట్ల డాక్టర్లు కూడా జ్వరాల బారిన పడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ ఈ రోజు ప్రగతిభవన్‌కు పరిమితమయ్యారన్నారు. డెంగ్యూ, మలేరియా జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరిన వారు రూ.30వేల చొప్పున కార్పోరేట్ ఆసుపత్రులకు సమర్పించుకున్నారన్నారు. ప్రభుత్వం నిద్రమత్తునుంచి బయటకు వచ్చి ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సహాయం అందించాలన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రద్దుకు
నిరసనగా 27 నుంచి పాదయాత్ర
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రద్దు చేసినందుకు నిరసనగా ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి చెప్పరు. శంకర్‌పల్లి దోబీపూర్ నుంచి చేవెళ్ల నుంచి ఈ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. శనివారం ఇక్కడ గాంధీభవన్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పాదయాత్ర నాలుగు రోజుల పాటు జిల్లాలో 88 కి.మీ పాదయాత్ర చేస్తామన్నారు. రైతాంగ ఆత్మహత్యలను నివారించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పట్ల రాష్ట్రప్రభుత్వానికి నిర్దిష్ట ప్రణాళిక లేదన్నారు. గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి ఇవ్వాలన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు సర్వే కోసం గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం రూ.11 కోట్లను మంజూరు చేసిందన్నారు. రాయలసీమను రతనాల సీమ చేసే ముందు తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులను పారద్రోలాలన్నారు.
కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి అనేక సబ్సిడీలు ఇచ్చి ఆదుకుందన్నారు. కరెంటు, మొక్కజొన్న, తడిసి రంగు మారిన ధాన్యం తక్కువ ధరకు ఇచ్చిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కోళ్ల రైతులకు కాకుండా కోళ్ల వ్యాపారులకు లాభం జరిగేలా చేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక సంక్షోభంలో చిక్కుకున్నారన్నారు.