తెలంగాణ

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి: జీవన్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ప్రాణహిత నదిపైన తుమ్మిడి హెట్టి బ్యారేజీ నిర్మాణం చేసి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలిస్తే అతి తక్కువగా కనీసం 120 టీఎంసీ నీటిని తరలించవచ్చని, దీని ద్వారా తెలంగాణ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. శనివారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని జనంలో విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ ప్రతినిధుల బృందం తుమ్మిడి హెట్టిని సందర్శిస్తుందన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత నది నీటితో తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలని2008లోనే ప్రణాళిక చేసిందన్నారు. తెలంగాణలోని ఏడు జిల్లలకు 16.4 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని, హైదరాబాద్ జంట నగరాలకు గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు అందించాలని ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. కేంద్రపరిశీలన సంస్థ వ్యాప్కోస్ ఇక్కడ నీటిని పరిశీలించి 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత నదిపైన తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే 160 టీఎంసీ నీటిని వినియోగించుకోవచ్చన్నారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని తరలించకుండా కేవలం లిఫ్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసేందుకు పోరాడుతామన్నారు.