తెలంగాణ

యురేనియం తవ్వకాలపై ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: నల్లమల అడవుల్లో కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు సన్నాహాలు చేస్తోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వౌనం దాల్చుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఈ విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం మిలాఖత్ అయినట్టు స్పష్టమవుతోందని అన్నారు. చెంచులను నిరాశ్రయులను చేయడంతో పాటు , ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటం దారుణమని , ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసొచ్చే ప్రగతిశీల శక్తులతో ఉద్యమిస్తామని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షలు, నిరుద్యోగ భృతి, వ్యవసాయ రుణ మాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలపై త్వరలోనే ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని సీపీఐ రాష్ట్ర సమితి నిర్ణయించిందని అన్నారు. సీపీఐ రాష్ట్ర నిర్మాణ సభ తేదీల్లో మార్పు జరిగిందని వెంకటరెడ్డి అన్నారు. దీని ప్రకారం డిసెంబర్ 20 నుండి 23 తేదీల్లో మంచిర్యాలలో నిర్మాణ మహా సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ లోగా రాష్ట్రం మొత్తం 33 జిల్లాల్లో జిల్లా నిర్మాణ సభలు పూర్తవుతాయని పేర్కొన్నారు.