తెలంగాణ

బీజేపీని విమర్శించే స్థాయి టీఆర్‌ఎస్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: బీజేపీ ఆన్‌లైన్ సభ్యత్వం, మొబైల్ నెంబర్ ఆధారిత సభ్యత్వం నమోదుపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ధర్మారావుప్రకటన విడుదల చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్నట్లు ఓటర్ లిస్టు ముందు పెట్టుకుని ఇంట్లో కూర్చొని బీజేపీ సభ్యత్వాన్ని నమోదు చేయడం లేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఆశ చూపెట్టి, బలవంతం చేసి సభ్యత్వం స్వీకరిస్తోందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోకపోతే పెన్షన్లు, రైతు బంధు ఆగిపోతాయని, ప్రజలను భయం పెట్టడం లేదన్నారు. సభ్యత్వం చేసుకుంటే బీమా వస్తుందని, టీఆర్‌ఎస్ లాగా బీజేపీ తాయిలాలు ప్రకటించలేదన్నారు. జాతీయవాదాన్ని బలపరచాలని, దేశాన్ని అభివృద్ధి చెందాలని, ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, బీజేపీ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కుటుంబ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతుండడం, పార్టీ సభ్యత్వ నమోదులో ప్రజలు తిరగబడుతుండడంతో ఆ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. తమపై ఆరోపణ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు వివరాలను బహిరంగ పరచాలన్నారు. కేటీఆర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన చాలా నేతలు మొబైల్ సభ్యత్వ నమోదుపై అవగాహన రహితంగా మాట్లాడడం మానుకోవాలన్నారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవడంతో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. నియంతృత్వ , నిరంకుశ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల ఓటమి ఖాయమన్నారు. అత్యధికంగ మున్సిపాలిటీలను, కార్పోరేషన్లను బీజేపీ గెలుచుకుంటుందన్నారు.