రాష్ట్రీయం

సెంట్రల్ వర్శిటీలో జింకల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: ఉన్నత చదువులకు పెట్టింది పేరుగా భాసిల్లుతున్న హైదరాబాద్‌లోని సెంట్రల్ వర్శిటీలో దారుణం జరిగింది. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వర్శిటీ ఆవరణలోకి చొరబడిన ఓ జింకను ఓ ఉద్యోగి కాల్చి చంపి, హాయిగా మాంసం వండుకుని ఆరగించాడు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గత కొంతకాలంగా జింకల వేట యథేచ్ఛగా సాగుతున్నట్టు అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై నిఘా పెట్టారు. తాజాగా ఓ జింకను ఎవరో కాల్చి చంపినట్టు పోలీసులకు ఉప్పందింది. అనుమానం వచ్చిన పోలీసులు, షూటింగ్ రేంజ్ అధికారి గోవిందరావు గదిని తనిఖీ చేయగా, సంచుల్లో ముక్కలు ముక్కలుగా చేసి దాచిన మాంసం కనిపించింది. వర్శిటీలోనే సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న బాలు, రాజయ్యలతో కలసి, వర్శిటీ లోకి చొరబడిన జింకను గోవిందరావు శనివారం రాత్రి కాల్చి చంపినట్టు పోలీసులు చెప్పారు. తిన్నంత తినగా మిగిలిన మాంసాన్ని విక్రయించేందుకు సిద్ధం చేశారని వారు తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చెందిన గోవిందరావుకొంతకాలంగా షూటింగ్ రేంజ్ అధికారిగా సెంట్రల్ వర్శిటీ పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. విద్యార్థులకు షూటింగ్‌లో శిక్షణ ఇవ్వడం ఈయన పని. నిందితులు ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నట్టు ఇన్‌స్పెక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు.

చిత్రం... స్వాధీనం చేసుకున్న జింక మాంసాన్ని పరిశీలిస్తున్న అధికారులు.
జింక తలను చూపిస్తున్న పోలీసు అధికారి (ఇన్‌సెట్‌లో)