రాష్ట్రీయం

తెలంగాణ హైకోర్టు తరలింపుపై భిన్నాభిప్రాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణ హైకోర్టును బుద్వేలుకు తరలించే అంశంపై న్యాయవాదుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తరఫున సాంకేతిక కమిటీ బుద్వేలులో హైకోర్టును సకల సదుపాయాలతో ఏర్పాటు చేయడం ఉత్తమమని అభిప్రాయపడగా, ఈ అంశంపై హైకోర్టు అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం కోరింది. న్యాయమూర్తులతో ఏర్పాటైన కమిటీ దీనిని అధ్యయనం చేస్తోంది. మరో పక్క తెలంగాణ బార్ కౌన్సిల్‌లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది తరలింపునకు అనుకూలంగా స్పందిస్తుండగా, మరికొంత మంది న్యాయవాదులు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. పాత భవన ప్రాంగణంలోనే ఖాళీగా ఉన్న స్థలంలో కొత్త భవనాలను నిర్మించి వసతుల కొరత తీర్చాలని కొంత మంది వాదిస్తుండగా, పాత భవనంలో ఎన్ని సౌకర్యాలను కల్పించినా, దానికి నగిషీ పట్టడమే తప్ప ఆధునికతను సంతరించుకోలేదని, అన్ని సౌకర్యాలతో ఒకే ప్రాంగణంలో న్యాయస్థానాలు, నివాస గృహాలు, ట్రిబ్యునళ్లు, ఇతర నగర కోర్టులు ఏర్పాటు చేస్తే మంచిదనే భావనను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గత కొద్ది రోజులుగా హైకోర్టులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనుకూల వర్గం, ప్రతికూల వర్గం తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తున్న వారంతా హైకోర్టు పరిరక్షణ కమిటీగా ఏర్పాటై ఇటీవల బార్ కౌన్సిల్ చైర్మన్‌ను కలిసి ఒక వినతిపత్రాన్ని అందించారు. హైకోర్టు న్యాయమూర్తుల కమిటీకి తమ అభిప్రాయాన్ని తీసుకువెళ్లాలని, అలాగే న్యాయమూర్తుల కమిటీ తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలిపే ముందు తమ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. నూతన భవనంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త వాతావరణంలో కోర్టులు ఏర్పాటైతే విశాల కోర్టు రూమ్‌లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని, అలాగే ఇరుకు గదుల వ్యవస్థ నుండి బయటపడవచ్చనే భావనను మరికొంత మంది న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సూచన మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా హైకోర్టులో నిరసనలు ఉద్ధృతం అవుతున్నాయి. హైకోర్టు పరిరక్షణ సమితి మంగళవారం నాడు బార్ కౌన్సిల్ గేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఉన్న అన్ని కోర్టుల అధ్యక్ష, కార్యదర్శులు వారి ప్రతినిధులను ఇందుకు ఆహ్వానించారు. ఇందులో న్యాయవాదుల ప్రతినిధులు పి విష్ణువర్ధన్‌రెడ్డి, ఫణీంద్ర భార్గవ్, జితేందర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారని పరిరక్షణ సమితి నేతలు చెప్పారు.