తెలంగాణ

బడ్జెట్ అసలు స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వాస్తవికతకు దూరంగా అంకెల గారడీతో కూడుకునే మూసా బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తిపలికింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గొప్పలకు పోకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయం, వ్యయాన్ని అంచనా వేసి వాస్తవికత ప్రతిభింబించేలా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం వల్ల కేంద్రం వసూలు చేసే పన్నుల రాబడి ఘణనీయంగా తగ్గడంతో రాష్ట్రానికి చెల్లించే వాటా తగ్గడంతో పాటు రాష్ట్ర సొంత ఆదాయ వనరులు గడిచిన నాలుగు నెలలుగా తగ్గుముకం పట్టడంతో బడ్జెట్ రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించినట్టు విధితమైంది. నీటిపారుదల రంగానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.22,500 కోట్లు కేటాయించగా ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్‌లో కేవలం రూ.8,490 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇది కూడా ఈ శాఖ ఎస్టాబ్లిష్‌మెంట్‌కయ్యే ఖర్చులు, ప్రాజెక్టుల కోసం తీసుకున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీలు, మార్జిన్ మనీకి చెల్లించే మొత్తానే బడ్జెట్‌లో కేటాయించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ.22,500 కోట్లు కేటాయించినప్పటికీ ఈ ఏడాది ఖర్చు చేసింది కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే. పైగా ప్రాజెక్టుల నిర్మాణానికి బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకోవడంతో ఈ పద్దును బడ్జెట్
అంచనాల నుంచి ఈ సారి తొలగించడం వల్లనే బడ్జెట్ అంచనాలు తగ్గడానికి కారణమని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వ్యాఖ్యానించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టేనాటికి ఆర్థిక మాంధ్యం ప్రభావం లేకపోవడం, రాష్ట్ర ఆదాయం పురోగతిలో ఉండటంతో అప్పటి అంచనాలకు తగ్గట్టుగా రూ.1.82 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఆర్థిక మాంధ్యం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వాటా తగ్గడం, రాష్ట్ర సొంత ఆదాయం కూడా తగ్గపోవడం వల్ల వాస్తవ పరిస్థితికి అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు కూడా రామకృష్ణారావు విశే్లషించారు. మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, నిరుద్యోగ భృతి తదితర వాటికి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి. మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు హాడ్కోలాంటి ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందడంతో వీటికి కేటాయించే పద్దులను ప్రస్తుత బడ్జెట్‌లో చూపించలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సిన వడ్డీ, రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సిన మార్జిన్ మనీని మాత్రమే ప్రస్తుత బడ్జెట్‌లో చూపడం వాస్తవికతకు అద్దం పట్టింది. రాష్ట్రానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే రాబడీని రైతుబంధు, పంట రుణాల మాఫీ, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఫీజుల రియంబర్స్‌మెంట్, ఓవరీస్ స్కాలర్‌షీప్స్, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం తదితర సంక్షేమ పథకాలకు మాత్రమే ఖర్చు చేసి, అభివృద్ధి పనులను అప్పుల ద్వారానే చేపట్టడం ద్వారా ఆర్థిక మాంధ్యాన్ని అధిగమించే సూత్రంగా బడ్జెట్ రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పాటించింది. నిరుద్యోగ భృతికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.1800 కోట్లు కేటాయించగా పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఎక్కడా ఆ పద్దును తొలగించింది. నిరుద్యోగ భృతికి ఇంకా విధి విధానాలను ఖరారు చేయకపోవడం, అలాగే ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయకపోవడంతో దానిని బడ్జెట్ ప్రతిపాదనల నుంచి తొలగించినట్టు ఆర్థిక శాఖ అధికారలు తెలిపారు. కొత్త సచివాలయ నిర్మాణానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ సిఫారసులకు (పీఆర్‌సీ) కూడా బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. సచివాలయ నిర్మాణానికి ఇంకా డిజైన్ ఖరారు చేయలేదు, ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు రూపొందించలేదు. అలాగే ఉద్యోగుల పీఆర్‌సీని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. దీంతో దీనికి కూడా ఎంత ఖర్చు అవుతుందో తేలకుండానే బడ్జెట్‌లో నిధులు కేటాయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్‌ను రూపొందించినట్టు ఆర్థికశాఖ అధికారులు విశే్లషించారు.