తెలంగాణ

నిరుపేద విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎఫ్ స్కాలర్‌షిప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ప్రతిభావంతులైన నిరుపేద భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది మూడు వేల స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్టు నార్త్ సౌత్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రత్నం చిట్టూరి ఒక ప్రకటనలో తెలిపారు. గత 30 ఏళ్ల నుండి కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం చూడకుండా నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నామని, ఇంత వరకూ దాదాపు 20 వేల మందికి స్కాలర్‌షిప్‌లు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది వివిధ ప్రవేశ, పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపిన నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఇందుకోసం డబ్ల్యుడబ్యుడబ్ల్యు డాట్ నార్త్ సౌత్ డాట్ ఆర్గ్ అనే వెబ్ పోర్టల్‌ను సందర్శించి అందులో లాగిన్ కావాలని అన్నారు. దరఖాస్తు చేసిన కాపీలను సమీపంలోని నార్త్‌సౌత్ ఫౌండేషన్ చాప్టర్‌లో అందజేయాలని, ఇందుకు సంబంధించిన వివరాలు సైతం పోర్టల్‌లోని ఇండియా స్కాలర్‌షిప్స్ లింక్‌లోకి వెళ్లాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసే వారి వార్షిక ఆదాయం ఏటా లక్ష రూపాయిలు మించరాదని అన్నారు.