తెలంగాణ

కేసీఆర్ మాట తప్పారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తనకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘హోంమంత్రి చేసిన వ్యక్తికి ఆర్టీసి చైర్మన్ పదవేంటీ? అది ఇచ్చినా తీసుకోను’ అని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ లాబీల్లో సోమవారం నాయిని మీడియా వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే సీఎం కేసీఆర్ వద్దన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగానే ఉండండి, ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్‌ను గెలిపించుకోస్తే మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు వివరించారు. తనకు మంత్రి పదవి, తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని నాయిని వాపోయారు. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతుంది, అదో రసం లేని పదవి అని పెదవి విరిచారు. తమ ఇంటి పెద్ద కేసీఆరేనని, అయితే తాను కూడా టీఆర్‌ఎస్‌కు ఓనరేనని నాయిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీలో కిరాయిదారులు ఉన్నారు. వారు ఎప్పుడు పోతారో ఏమోనని నాయిని అసంతృప్తి వ్యక్తం చేశారు.