తెలంగాణ

బడ్జెట్‌పై ఎవరేమన్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి కోసం వంద శాతం నిధులు కేటాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిరూపించుకున్నారని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు కేటాయిస్తూనే, సంక్షేమ కార్యక్రమాలను యధావిధంగా కొనసాగించడానికి నిధులు కేటాయించారన్నారు. ఆర్థిక మాంధ్యం నెలకొన్నా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను యథాతథంగా కొనసాగించే విధంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రజలను మభ్య పెట్టే విధంగా కాకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తూనే రైతుబంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఫీజు రియింబర్స్‌మెంట్‌కు నిధుల కేటాయింపు జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రజలకు తెలియజెప్పామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు
* పెదవి విరిచిన భట్టి విక్రమార్క

హైదరాబాద్, సెప్టెంబర్ 9: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని, భ్రమలు కల్పించి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ శాసనసభపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో వచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పరిపాలన ఫలితం ఇపుడు కన్పిస్తుందని, సీఎం కేసీఆర్‌కు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే అప్పులు పెరిగాయని, ఆయన చేతకానితనాన్ని కేంద్రం మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తొలుత జీఎస్టీని పొగిడిన సీఎం ఇపుడు కేంద్రాన్ని దూషించడం, కేసీఆర్ పాలన ఫలితాలు బయటకు వస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం ఎంతో నష్టం పోతోందని దుయ్యబట్టారు. దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ఆర్థిక మాంద్యం దిశగా తీసుకొచ్చారని విమర్శించారు. సీఎం బడ్జెట్ ప్రసంగంలో డబుల్ బెడ్‌రూం, నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన లేవని ప్రభుత్వం నిప్పులు చెరిగారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో హైదరాబాద్‌కు నీరు తెచ్చింది కాంగ్రెస్ అయితే, అది తన క్రెడిట్‌గా కేసీఆర్ చెప్పుకుంటున్నారని, ఆయన చేసిందేమీ లేదని జలకళ మొత్తం తెచ్చింది ఆయనే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మెట్రో రైలు తెచ్చింది కూడా ఆయన కాదు, గత ప్రభుత్వాల పరిపాలన వల్ల వచ్చిన ఫలితాలు తనదని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని భట్టి చెప్పారు.
సామాజిక రంగాలను దెబ్బతీశారు
* వామపక్షాల పెదవి విరుపు

హైదరాబాద్, సెప్టెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌పై వామపక్షాల నేతలు పెదవి విరిచారు. తాజా బడ్జెట్ ఉత్పత్తి, సామాజిక రంగాలను పూర్తిగా దెబ్బతీస్తుందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. గత ఏడాది బడ్జెట్ కంటే ఈ ఏడాది 40వేల కోట్లు తగ్గించారని, ఆర్ధిక మాంద్యం, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే బడ్జెట్‌ను ఇలా తగ్గించాల్సి వచ్చిందని చెప్పడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి ఉత్పత్తిరంగాలను, సామాజిక రంగాలను అభివృద్ధి చేయడానికి బడ్జెట్‌ను సవరించాలని, రాష్ట్రంలో ఉన్న వౌలిక వసతులను వినియోగించి వ్యవసాయ పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయాలని సీపీఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా, బడ్జెట్ రూపకల్పనలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆరు నెలల వ్యవధిలో ఆయన ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లకూ పొంతన లేకుండా పోయిందని, బడ్జెట్‌ను 1.82 లక్షల కోట్లు నుండి 1.46 లక్షల కోట్లకు స్వయంగా కుదించారని పేర్కొన్నారు. ఇది ఆర్థిక శాఖ ఇంత వరకూ తన వద్దనే పెట్టుకున్న సీఎం అసమర్థతకు అద్దం పడుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అతి పెద్ద కోతల బడ్జెట్‌గా చరిత్ర సృష్టించిందని చాడ విమర్శించారు. ఆరు నెలల వ్యవధిలో సుమా 40వేల కోట్లు కోత విధించడం విచిత్రంగా ఉందని అన్నారు.
నిరాశాజనకంగా ఉంది
*ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి సమావేశాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రకటించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఎక్కడ ఉద్యోగుల ప్రస్తావన తీసుకురాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం విధానాలను అమలు చేస్తున్న ఉద్యోగులు పట్ల ప్రభుత్వం కనికరం చూపించకపోవడం దుర్మార్గం అన్నారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో డొల్లతనం తప్ప మరొకటి కాదన్నారు. విద్యాశాఖకు ఎంత నిధులు ఖర్చు చేస్తారో చెప్పలేదన్నారు. విద్యాశాఖలో వేల ఉద్యోగల భర్తీ చేయకుండా నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారని ఆయన నిలదీశారు. బడ్జెట్ ప్రతిపాదనలను 100 శాతం పెంచడం మతలబు ఏమిటో చెప్పాలన్నారు. ఆర్థిక మాంద్యం అంటూ కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని ప్రభుత్వం చెప్పడం విడ్డూరం అన్నారు.
మాంద్యం ఉన్నా అభివృద్ధి జోరు
*తెరాస ఎమ్మెల్సీ కర్ని ప్రభాకర్

హైదరాబాద్, సెప్టెంబర్ 9: దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా కేసీఆర్ చేపట్టిన అభివృద్ధిలో జోరు కొనసాగుతోందని తెరాస ఎమ్మెల్సీ కర్ని ప్రభాకర్ అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడంతో ప్రభుత్వ పథకాలకు నిధులు కొరత ఉందన్నారు. అయినా పథకాలను కొనసాగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిలో ఎలాంటి రాజీ లేదన్నారు. ఆర్థిక మాంద్యంతో దేశంలో ప్రగతి కుంటుబడుతోందని ఎమ్మెల్సీ కర్ని ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్ రూంల ప్రస్తావన ఏదీ?
*టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల

హైదరాబాద్, సెప్టెంబర్ 9: రాష్ట్ర బడ్జెట్‌లో డబుల్ బెడ్‌రూంమ్‌ల ప్రస్తావన లేకపోవడం ఏమిటని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీఎస్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ప్రశ్నించారు. సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకం డబుల్ బెడ్ రూంల ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌లో 2 లక్షల 85 వేల ఇండ్లకు టెండర్లును పిలిచామని గతంలో పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. పేదలను మోసం చేయడమే పనిగా ఉందన్నారు. ఓటు-ఆన్-అకౌంట్ బడ్జెట్‌లో ప్రభుత్వం చెప్పిన అంశాలు పూర్తిస్థాయి బడ్జెట్‌లో రాలేదన్నారు. కేవలం ఆరునెలల్లో బడ్జెట్ ప్రతిపాదనల్లో వేల కోట్లు తేడాలు ఉండడం శోచనీయం అన్నారు. ఈ తేడాలు చూస్తుంటే రాష్ట్ర ప్రగతి పెరిగినట్లా? తగ్గినట్లా? రాష్ట్ర ఆర్థిక వనరులు పెరిగాయా, తగ్గాయా అన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది జనరంజకం
*ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకమైన ప్రజల బడ్జెట్ అని నాగార్జున సాగర్ శాసన సభ్యుడు నోముల నర్సయ్య తెలిపారు. బడ్జెట్ సమావేశం అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని సంక్షేమ రంగాలకు ఉపయోగపడే విధంగా ఉందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. మాంద్యం ఉన్నప్పటికీ శాఖలకు కేటాయింపుల్లో సమన్యాయం చేశారన్నారు.
కేసీఆర్ కోతల బడ్జెట్
* ములుగు శాసన సభ్యురాలు సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కోతల బడ్జెట్ అని ములుగు శాసన సభ్యురాలు సీతక్క విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సీఎం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యం దిశగా తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు మిగిల్చిన సంపదను ఆయన విచ్చలవిడిగా ఖర్చు చేశారని, సీఎం పరిపాలన తీరుతోనే ఆర్థిక మాంద్యం దిశగా తీసుకొచ్చారని పేర్కొన్నారు.