తెలంగాణ

తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై కేసీఆర్ నిందలు: కిషన్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019- 2020) ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని వారు విమర్శించారు. కేసీఆర్‌కు పాలన చేతకాక కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా ప్రధాన మంత్రి జాగ్రత్తగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవ అతిధులకు రూ. కోటి 90 లక్షలతో బహుమతులు ఇవ్వడం వాస్తవం కాదా అంటూ వారు నిలదీశారు. ముఖ్యమంత్రి తన తప్పదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేయడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి సమావేశాలు వాయిదా అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులు రాకపోవడానకి కేంద్రం కారణమని బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొనడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో ఎక్కువ భాగం కేంద్రాన్ని నిందించడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఆర్థిక మాంద్య అంటూనే బడ్జెట్ ప్రతిపాదనల్లో కోట్ల రూపాయలు పెంచడం కేంద్రంపై కుట్ర అంటూ వారు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవాలను చెప్పకుండా కేంద్రం నిధులు విడుదల చేయడంలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నట్లగా ఉందని వారు గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ బాగుందని చెబుతూనే ఆయూష్‌మాన్‌భవ వైద్య పథకం మంచిగా లేదని చెప్పడం ముఖ్యమణత్రి దుర్మార్గపు చర్యలకు నిదర్శనమన్నారు. ఇలాంటి ప్రకటనలతో ముఖ్యమంత్రి పట్ల చులకన భావం కల్గుతుందే తప్పా మరోకటి కాదని వారు హితవు పలికారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యం కుంటుబడితదన్నారు.
ఆరోగ్యశ్రీ వైద్యం అందక ఆసుపత్రి ప్రాంతల్లో రోగులు వైద్యం చేసుకున్న సంఘటనలు ముఖ్యమంత్రి కన్పించలేదా అంటూ వారు నిలదీశారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించడానికి ముఖ్యమంత్రి సొంత పథకాలకు వినియోగించడం జరుగుతోందన్నారు.
చిత్రం... కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి