తెలంగాణ

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఆగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్‌కు రెడ్డి సంఘాల ఐక్య వేదిక వినతిపత్రం అందించింది. నగరంలోని ఆయన నివాసంలో రెడ్డి ఐక్య వేదిక వినతిపత్రం అందించారు. మంగళవారం ఆయన నివాసంలో రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏ. సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడిగా ఎన్నికైన సందర్భంగా వినోద్ కుమార్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఈడబ్ల్యుఎస్ కోట కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా తెలంగాణ రాష్ట్రానికి మంజురు చేసిన 190 మెడికల్ సీట్లను ఆగ్రవర్ణ పేద విద్యార్థులకు మాత్రమే అమలు అయ్యేలా చూడాలని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఅర్ హామీ ఇచ్చినట్లు, రూ.10 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఆగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం జనరల్ గురుకులకు అవకాశం కల్పించాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, నాయకులు బాల్‌రెడ్డి, చంద్ర రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.