తెలంగాణ

ఇది ప్రగతి నిరోధక బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: రాష్ట్ర బడ్జెట్ ప్రగతి నిరోధక బడ్జెట్ అని, అభివృద్ధి 20 ఏళ్లపాటు వెనక్కు వెళ్లిందని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, సంక్షేమ రంగాన్ని అటకెక్కించారన్నారు. సంక్షేమానికి బడ్జెట్‌లో కోతలు పెట్టిన సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. కేసీఆర్ కేంద్రం మీద తప్పును నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చింతమడకలో ప్రతి ఒక్కరికి పది లక్షలు ఇచ్చినప్పుడు ఆర్థిక మాంద్యం గుర్తుకు రాలేదన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును గుడ్డిగా మద్దతు ఇస్తూ, ఈ రోజు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే జనం నమ్మరన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పేద ప్రజల వ్యతిరేకులన్నారు. అప్పుల ఊబిలో నెట్టేసిన ఘనత కేసీఆర్ దక్కుతుందన్నారు.