తెలంగాణ

నేటి నుండి సాయుధ పోరాట ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ పోరాట 72వ వార్షికోత్సవాలను బుధవారం నుండి నిర్వహించేందుకు సీపీఐ భారీ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలు లోటస్ పాండ్ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఉదయం బూర్గుల నర్సింగరావు అధ్యక్షతన ప్రారంభం అవుతాయి. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమర యోధుడు సీహెచ్ హన్మంతరావు పుస్తకావిష్కరణ చేస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమర యోధులకు సన్మానం చేస్తారు. స్ఫూర్తి యాత్ర 11వ తేదీన మొదలై 17 వరకూ జరుగుతుందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. అమరవీరుల ట్రస్టు కార్యాలయంలొ ప్రారంభమై షాద్‌నగర్, నాగర్ కర్నూలు, దిండి, దేవరకొండ, నల్గొండ, హుజూర్‌నగర్, కోదాడ, నేలకొండపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, దేవురుప్పుల, హుస్నాబాద్ మీదుగా ఇందుర్తి చేసుకుంటుందని అన్నారు. అక్కడి నుండి కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల మీదుగా హైదరాబాద్ వస్తుందని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభతో ముగుస్తుందని చెప్పారు.