తెలంగాణ

జోగు రామన్న కంటతడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 11: ‘ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే తత్వం నాది.. మంత్రి వర్గ విస్తరణలో తప్పనిసరిగా పదవి దక్కుతుందని భావించినప్పటికీ పదవి రాకపోవడంతోనే హై బీపీతో అస్వస్థతకు గురయ్యా’ అంటూ మాజీ మంత్రి జోగు రామన్న కంటతడి పెడుతూ ఉద్వేగంగా అన్న మాటలివి. మంత్రి వర్గ విస్తరణ అనంతరం తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న మాజీ మంత్రి జోగు రామన్నకు కార్యకర్తలు పార్టీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన నివాస ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీరు సుడులు తిరుగుతుండగా జోగు రామన్న తన రాజకీయ ప్రస్థానం నుండి, సామాన్య కార్యకర్త నుండి మంత్రిగా ఎదిగిన వైనం గూర్చి వివరించారు. తాను అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు పత్రికల్లో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. విస్తరణలో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని పూర్తి భరోసాతో ఉన్నానని, చివరకు అనూహ్యంగా జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి లోనై హై బీపీతో ఆస్పత్రిలో చేరినట్టు రామన్న వెల్లడించారు. కార్యకర్తల నుండి, అభిమానుల నుండి ఫోన్‌ల తాకిడి పెరగడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గన్‌మెన్‌లను వదిలి విశ్రాంతి తీసుకున్నానని, పదవి దక్కకపోయినా కేసిఆరే తనకు నాయకుడని స్పష్టం చేశారు. తనకు వెన్నంటి నిలుస్తున్న కార్యకర్తలు, శ్రేయోభిలాషులను జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని, ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సేవలోనే తరిస్తానని స్పష్టం చేశారు. రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా పైకి ఎదిగిన వ్యక్తినని, ఎవరికీ ద్రోహం చేసే వ్యక్తిని కాదని రామన్న అన్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఆవేశాలకు లోనై ఆత్మహత్యా యత్నం చేసుకోవద్దని రామన్న ఈ సందర్భంగా కోరారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు ఊహాజనితమని, టిఆర్‌ఎస్‌తోనే తన జీవితం ముడిపడి ఉంటుందని స్పష్టం చేశారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా కుటుంబ సభ్యులతో కలసి తన ఆరోగ్యం గూర్చి వివరించారు.
కార్యకర్త ఆత్మహత్యా యత్నం
జోగు రామన్న ప్రెస్‌మీట్ కొనసాగుతుండగానే టీ ఆర్‌ఎస్ కార్యకర్త వాగ్మారే ప్రశాంత్ అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం అలజడి రేపింది. మూడు రోజుల కిందట సాయి రవి రామన్న నివాస గృహం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, బుధవారం రామన్నకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ప్రశాంత్ సీసాలోంచి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే కార్యకర్తలు, టౌన్ సీఐ సురేష్ అతన్ని వారించి బయటికి తీసుకెళ్లారు.
చిత్రాలు.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జోగు రామన్న

*ఆత్మహత్యా యత్నం చేసిన కార్యకర్త (ఇన్‌సెట్‌లో)