తెలంగాణ

సాగర్ 22 గేట్ల నుంచి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున సాగర్, సెప్టెంబర్ 11: నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల నుండి దిగువకు నీటి విడుదల బుధవారం కూడా కొనసాగింది. ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్ గేట్లకు 22 గేట్ల నుండి నీటి విడుదల కొనసాగుతుండగా సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తూ ప్రాజెక్టు గేట్ల నుండి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను వీక్షిస్తూ పరవశులువుతున్నారు.
ఉదయం 10 గేట్లు ఎత్తిన అధికారులు తదుపరి 16 గేట్లకు, 20 గేట్లకు పెంచి సాయంత్రానికి 22 గేట్లను 10 ఫీట్ల మేరకు ఎత్తి నీటి విడుదల కొనసాగించారు. బుధవారం సాయంత్రం నాగార్జున సాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు నుండి 3 లక్షల 50 వేల 635 క్యూసెక్కులు వస్తుండగా అంతే పరిణమంలో సాగర్ జలాశయం నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 590 అడుగులకు గాను 589.89 అడుగులుగా ఉండగా 312 టీఎంసీలకు గాను 311.44 టీఎంసీలుగా ఉంది. సాగర్ జలాశయం నుండి కుడి కాల్వ ద్వారా 10 వేల 120 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 5510 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా 32 వేల 845 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 22 గేట్లను 10 ఫీట్లు ఎత్తి 3 లక్షల 16 వేల 480 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుండి 3 లక్షల 57 వేల 172 క్యూసెక్కులు వస్తుండగా ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.70 అడుగులు, 213 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లను 20 అడుగుల మేరకు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.

చిత్రం...22 గేట్ల నుంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ