తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలే టార్గెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమై పార్టీ బలోపేతంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో
అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ అధినేత సూచనతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసామన్నారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా 60 లక్షల సభ్యత్వాలతో దేశంలోనే బలమైన పార్టీల్లో ఒకటిగా టీఆర్‌ఎస్ నిలిచిందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం ద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎమ్మెల్యేలు స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. జిల్లాల వారిగా పార్టీ కమిటీల ఏర్పాటుపై కూడా ఈ సందర్భంగా కేటీఆర్ చర్చించారు. త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇలా ఉండగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.