తెలంగాణ

బీజేపీ వైపు.. కాంగ్రెస్ నేతల చూపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడంతో ఆ పార్టీకి చెందిన అనేక మంది పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీవైపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీ సుభాష్ తెలిపారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సుడిగుండంలో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గడ్డిపోచ కూడా దొరకడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు తిరస్కరించడంతో కొన్ని అంశాలు మాట్లాడకూడదన్నారుర. కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రజా సమస్య మీద పోరాటం చేసిందా అని ప్రశ్నించారు. పార్లమెంటరీ సంప్రదాయాలు తెలియకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. గవర్నర్, రాష్టప్రతి ప్రసంగాలు ఏ విధంగా ఉంటాయో కాంగ్రెస్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ తీవ్రవాద నిరోధక బిల్లును తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీకి గతంలో పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. అదేవిధంగా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అనేక పార్టీలు బీజేపీకి బిల్లు ఆమోదంపై మద్దతు ఇస్తే కుమ్మక్కైనట్లు కాంగ్రెస్ నేతలు భావించడం దివాలారాజకీయాలకు నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తప్పిదాలపైన, ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడం చూసి ఓర్వలేని కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు క్షమించరన్నారు.