తెలంగాణ

మంత్రులకు అదనపు బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: శాసనసభ, శాసనమండలి సమావేశాలు కొనసాగున్నందున రెండు సభల్లోనూ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన కొన్ని శాఖలను ఇతర మంత్రులకు అప్పచెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీఏడి (పొలిటికల్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఒక నోట్ బుధవారం జారీ అయింది. రెవెన్యూ శాఖను రోడ్లు భవనాల మంత్రి వి. ప్రశాంతరెడ్డికి, గనులు, భూగర్భజలశాఖ, సమాచార, పౌరసంబంధాల శాఖలను మున్సిపల్ వ్యవహారాల మత్రి కే. తారకరామారావుకు, నీటిపారుదల, జీఏడి, లా అండ్ ఆర్డర్ శాఖలు ఆర్థిక మంత్రి టి. హరీష్‌రావుకు, వాణిజ్య పన్నుల శాఖను పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు అప్పగించారు.