తెలంగాణ

వారం రోజుల్లో అన్నీ చక్కదిద్దుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: విద్యారంగంలోని సమస్యలపై దృష్టిసారించి ఒకొక్కటీ వారం రోజుల్లో చక్కదిద్దుతానని కొత్త విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో బుధవారం నాడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించి దేశంలోనే రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపేందుకు అంతా ప్రయత్నించాలని కోరారు. మిషన్ భగీరథ పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి, సంబంధిత స్థానిక అధికారులతో సంప్రదించి పరిష్కరించుకోవాలని చెప్పారు. పిల్లల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అనుకూలంగా ప్రతి పాఠశాలలో పత్రిక ప్రారంభించాలని ఆమె సలహా ఇచ్చిరు. తనను కలిసేందుకు వచ్చే వారిని పూలమాలలు, బొకేలు తీసుకురావద్దని దానికి బదులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల ఉపయోగార్ధం నోటు పుస్తకాలు ఇవ్వాలని కోరానని అన్నారు. దానికి అనుగుణంగా ఆమెను కలవడానికి వచ్చిన వారు 43వేల నోటు పుస్తకాలు ఇచ్చారని, వీటిని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు తర్వాత ప్రతి శాఖ అధికారులతో విడిగా సమావేశాలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు. 2019 మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించినందుకు విద్యాశాఖ అధికారులను ఆమె అభినందించారు. విద్యాశాఖకు మంచి పేరు తీసుకురావడనాకి అధికారులు అంతా కృషి చేయాలని అన్నారు. ఈసమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్థనరెడ్డి, విద్యాశాఖ కమిషనర్ టీ విజయకుమార్, ఎమ్మెల్యే యాదయ్య, ఈఐడబ్ల్యుడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, ఇంటర్ బోర్డు కార్యదర్శి బీ అశోక్, కేజీబీవీ కన్సల్టెంట్ ప్రియదర్శిని, తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు , అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు తమ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆమెకు వివరించారు. అంతకుముందు మంత్రి సబితా విద్యాశాఖ రూపొందించిన ఈ మ్యాగజైన్ ఎడ్యుసూర్‌ను ఆవిష్కరించారు. దీనివల్ల రాష్ట్రంలోని 29 లక్షల మంది విద్యార్ధులకు, రెండు లక్షల మంది ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. పాఠశాలల్లో విజయగాధలు వెలుగులోకి వస్తాయని అన్నారు. మంచి విద్యావేత్తలు, విషయ నిపుణుల ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న మన రాష్ట్రంవైపు ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయని, అలాగే విద్యారంగం వైపు కూడా చూసేలా ప్రయత్నించాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నెలకోల్పిన గురుకుల పాఠశాలలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడుతూ కృషి చేస్తున్నారని తెలిపారు. అక్షరాస్యతలో ముందుండటానికి, గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపవుట్లను తగ్గించడానికి ప్రధానంగా ఆడపిల్లల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని అన్నారు. విద్యారంగంపై ఖర్చు చేసే ప్రతిపైనా సద్వినియోగమై దానికి రెట్టింపు ప్రతిఫలం విద్యార్థులకు అందించాలని అన్నారు. విద్యార్థులు అంతా అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు అందుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యాభిమానులకు కూడా తోడ్పాటు అందించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో గతంలో జరిగిన తరహా చిన్న చిన్న పొరపాట్లు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.