తెలంగాణ

గంత పెద్దగా రాస్తారనుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ‘నేనేదో మాట్లాడితే గంత పెద్దగా రాస్తారనుకోలేదు. గట్ల్లెందుకు మాట్లాడావు నర్సన్న అని కేటీఆర్ అడిగారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి వాపోయారు. అసెంబ్లీ లాబీల్లో తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ మాటతప్పారని నాయిని చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌లో దూమారం రేపిభ విషయం తెలిసిందే. శాసనమండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా సమావేశానికి హాజరైన నాయిని బుధవారం మరోసారి మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘గింత చిన్న విషయాన్ని గంత హైలెట్ చేస్తారని అసలు అనుకోలేదు’ అని నాయిని వ్యాఖ్యానించారు. నేను మాట్లాడిన దానిపై కేటీఆర్ అడిగారు, సీఎం పిలిస్తే వెళ్లి మాట్లాడుతానని చెప్పారు. టీఆర్‌ఎస్ తమ అందరి పార్టీ అనీ, పదవులు కూడా తమకే వస్తాయన్నారు. ఆర్టీసీ చైర్మన్ పదవిలో రసం లేదని నాయిని చేసిన వ్యాఖ్యలను తిరిగి ప్రస్తావిస్తూ రసం లేకపోతే వాళ్లే పోసి ఇస్తారని అన్నారు.

చిత్రం... మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి