తెలంగాణ

యాదాద్రి దివ్యక్షేత్రం దేశానికే తలమానికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దేశంలోని భక్తులందరూ సందర్శించేలా సీఎం కేసీఆర్ అద్భుత శిల్పకళతో ప్రతిష్టాత్మకంగా నిర్మింపచేస్తుండటం అభినందనీయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నూతన ఆలయాన్ని సందర్శించి విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే, సీఎంగా కేసీఆర్ కాకపోయింటే యాదాద్రి ఆలయ అభివృద్ధిగాని, యాదాద్రి భువనగిరి జిల్లాగాని జరిగేవి కావన్నారు. దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రంగా యాదాద్రి ఆలయం తీర్చిదిద్దుతుండటం రాష్ట్ర ప్రజలకు, భక్తులందరికీ గర్వకారణమన్నారు. భవిష్యత్‌లో యాదాద్రి ఆలయం తెలంగాణకే కాకుండా దేశానికే తలమానికంగా నిలుస్తుందని, ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఆలయం నిలిచిపోతుందన్నారు. మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో తాను తన ఇష్టదైవమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడిని దర్శించుకోవడం అనందంగా ఉందన్నారు. బంగారు తెలంగాణ సాధనకు నిరంతరం తపిస్తున్న సీఎం కేసీఆర్‌కు లక్ష్మీనరసింహుడి ఆశీర్వచనాలు ఉండాలన్నారు.
గుత్తా వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, యాదాద్రి జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి ఉన్నారు.
*చిత్రం... యాదాద్రిలో విలేఖరులతో మాట్లాడుతున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి