తెలంగాణ

జూరాలలో 16 గేట్ల ద్వారా నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 12: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం జూరాల ప్రాజెక్టు 318.50 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంచుకొని, 16 గేట్లను ఎత్తివేసి 1,42,800 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 37 వేలు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంకు 1500, భీమా లిఫ్ట్-1కు 650, లిఫ్ట్-2కు 750, సమాంతర కాలువకు 650, కోయిల్‌సాగర్‌కు 630, కుడి కాలువకు 752, ఎడమ కాలువకు 1100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు దగ్గర 121.05 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకొని 1,31,949 క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ డ్యాంకు వదులుతున్నారు. ఎగువ నుంచి ఆల్మట్టికి 2,10,119 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నారాయణపూర్ ప్రాజెక్టు దగ్గర 35.38 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకొని 1,31,015 టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకు 1,12,729 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

*చిత్రం...జూరాల నుంచి విడుదలవుతున్న వరద నీరు