తెలంగాణ

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన కేసీఆర్: పెద్ది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో పాల్గొన్న సుదర్శన్‌రెడ్డి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు టీఆర్‌ఎస్ ఏనాడూ నిరాధార ఆరోపణలు చేయలేదని, కాని నేడు కాంగ్రెస్ నేతలు అన్నీ అసత్యాలు చెబుతున్నారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రీడిజైనింగ్‌లో తెలంగాణ ప్రజల మేలును కాకుండా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నారని అన్నారు. గత ఐదేళ్లలో మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో పాటు గోదావరి, కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకున్నామని, అయితే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం తప్పుడు సమాచారం ఇస్తున్నాయని అన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీడబ్ల్యుసీ, పవర్ కార్పొరేషన్ అధికారులు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు చూసి అబ్బురపోతుంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలకు ఆ ప్రాజెక్టు కనిపించకపోవడం విడ్డూరమని అన్నారు. మండలం యూనిట్‌గా ప్రతి ఏటా 20 శాతం చెరువులను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేస్తున్నారని, తద్వారా గ్రామీణ జీవన వైవిధ్యానికి ఊతం ఇచ్చేలా చెరువుల పునరుజ్జీవం జరుగుతోందని అన్నారు. ప్రాజెక్టులకు ఈపీసీ, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు లేకుండానే అన్ని ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందని, వాటి నిర్వహణ బాధ్యత కూడా మరో పదేళ్లు ఆయా ఏజన్సీలకే అప్పగించిందని, తద్వారా ప్రభుత్వం జవాబుదారీతనాన్ని రుజువు చేసుకుందని అన్నారు.