తెలంగాణ

హైదరాబాద్‌లో 82 శాతం కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 82 శాతం వాతావరణ కాలుష్యం వ్యాపిస్తోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ కాలుష్యం వాహనాల ద్వారా 49 శాతం, రోడ్లపై ఉన్న దుమ్ము, ధూళితో 33 శాతం వాతావరణ కాలుష్యం అవుతోందని మంత్రి శనివారం మండలి సమావేశాల్లో వెల్లడించారు. చర్చల్లో పాల్గొన్న ఎంఐఎం సభ్యులు సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి, మిర్జారియాజ్ ఉల్‌హసన్ ఇప్ఫెండి హైదరాబాద్‌లో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోందని, అందుకు ప్రభుత్వం నివారణ చర్యలు ఏమిటో చెప్పాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో కాలుష్యంను తగ్గించడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చెపడుతోందన్నారు. ఎన్‌పీసీబి సహకారంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు వాయి నాణ్యత గుర్తించడానికి చర్యలు ఉన్నాయన్నారు. వాయువు, శబ్ధ, నీటి కాలుష్యంపై రాష్ట్ర, జిల్లా స్థాయిలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. శబ్ధ కాలుష్యం వాహనాలు, హారన్లు, డీజల్ జనరేటర్లు, టపాసులు, లౌడ్ స్పీకర్లు ద్వారా శబ్ద కాలుష్యం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. నీటి కాలుష్యం హైదరాబాద్ ఉస్సెన్ సాగర్‌తో పాటు రాజధానిలో ఉన్న అన్ని చెరువులు, కుంటలతో కాలుష్యం పెరుగుతోందన్నారు.