తెలంగాణ

నల్లమల్ల పరిరక్షణకు ప్రాణ త్యాగానికైనా సిద్ధం : ఎమ్మెల్యే గువ్వల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 14: ప్రకృతి రమనీయతకు మారుపేరుగా చెప్పుకునే నల్లమల్ల అడవులను పరిరక్షించుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్దమని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సేవ్ నల్లమల్ల ఉద్యమానికి అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని అన్నారు. మంత్రి కేటీఆర్ సైతం ఈ అంశంపై ట్విట్ చేయడంతో ఈ ఉద్యమానికి మరింత బలం చేకూరిందని అన్నారు. యురేనియం తవ్వకాలకు బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. యురేనియం తవ్వకాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. యురేనియం తవ్వకాల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దోబుచూలాడుతున్నాయ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దేశ ప్రధాని మోదీ స్వయంగా ఆసియాలోనే అత్యధిక పులులు కలిగిన ప్రాంతం అమ్రాబాద్ అని మాట్లాడి అంతటి ప్రాధాన్యత కలిగిన అడవులను నాశంన చేసేందుకు పూనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ సేవ్ నల్లమల్లకు బాసటగా నిలుస్తుండటంతో ఇతర అన్ని వర్గాల సహాయాన్ని తీసుకొని యురేనియం తవ్వకాలను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు.