తెలంగాణ

కేసీఆర్ పాలన అద్భుతం: ఎమ్మెల్యే గ్యాదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: కేసీఆర్ పరిపాలన అత్యద్భుతంగా కొనసాగుతోందని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కితాబిచ్చారు. శాసనసభలో బడ్జెట్‌పై శనివారం జరిగిన చర్చలో పాల్గొంటూ, బడ్జెట్‌లో స్పష్టమైన వివరాలను కేసీఆర్ ఇచ్చారన్నారు. ఆర్థిక మాంద్యం వల్ల బడ్జెట్ ప్రతిపాదనలు తగ్గించామంటూ కేసీఆర్ వివరించారన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు కొనసాగుతాయన్నారు. నియమావళికి అనుగుణంగానే అప్పులు తీసుకువస్తున్నారని తెలిపారు. శివన్నగూడెం ప్రాజెక్టు నిర్వాసితులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడిన సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ శివన్నగూడెం ప్రజలకు హామీ ఇస్తే, కాంగ్రెస్ నేతలు ఈ హామీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాలు విజయవంతంగా కొనసాగుతుండటం కేసీఆర్ ఆలోచనలకు అద్దం పడుతోందన్నారు. మంచిపరిపాలన కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడంపట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.