తెలంగాణ

మెరుగైన వైద్యంతో పాటు నాణ్యమైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైద్యరంగం ముఖచిత్రానే్న మార్చేసిందని, అత్యాధునిక వైద్య చికిత్సల పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, ఈ పరిస్థితుల్లో మెరుగైన వైద్యంతో పాటు నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత ఆస్పత్రులు, వైద్యులపై ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ‘నూతన సాంకేతిక పరిజ్ఞానం - ఆరోగ్య రక్షణలో మార్పు’ అంశంపై అపోలో ఆస్పత్రుల యాజమాన్యం రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్‌తో పాటు వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్, దేశ విదేశాల నుండి 2500 మంది ప్రతినిధులు, అపోలో ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ వైద్యాన్ని అందించేందుకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఇలాంటి సదస్సులు వల్ల అంతర్జాతీయంగా వైద్య రంగంలో వస్తున్న మార్పులను అర్ధం చేసుకునేందుకు, నూతన ఒరవడిని అందిపుచ్చుకునేందుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. టెక్నాలజీ జీవనశైలిని మార్చేస్తోందని, వైద్య రంగంలోకీ కృత్రిమ మేథ ప్రవేశిస్తోందని అన్నారు. అలాగే రోబోట్‌లు, నానోటెక్నాలజీ చాలా కీలక భూమికను పోషిస్తున్నాయని చెప్పారు. వైద్యరంగంలో భారత్‌కు ఎంతో పేరుందని, ప్లాస్టిక్ సర్జరీకి మార్గం చూపింది మనవాళ్లేనని అన్నారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయని అన్నారు. త్వరలో తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారుచేయబోతున్నామని అన్నారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేశామని తెలిపారు. కేసీఆర్ కిట్స్ అందజేశామని, సీఎం ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. డయాగ్నస్టిక్స్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు.

చిత్రం... అపోలో ఆస్పత్రుల యాజమాన్యం రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు
ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న గవర్నర్ తమిళ సై సౌందరరాజన్