తెలంగాణ

ఆరుసార్లు అడ్డుకున్న ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభలో శనివారం జరిగిన బడ్జెట్ చర్చల్లో కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టి విక్రమార్క మా ట్లాడుతుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరుసార్లు అడ్డుకున్నారు. భట్టి తప్పుడు సమాచారమిస్తూ సభను తప్పుదారి పట్టిస్తున్నారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాగ్’ తన నివేదికలో పేర్కొన్న లె క్కలనే తాను బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించానని అన్నారు. విపక్షా లు సద్విమర్శ చేస్తే స్వీకరిస్తామని, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెబుతూ ఉంటే తప్పనిసరిగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు చెబుతామని, ఆర్థిక మాంద్యం వల్లనే బడ్జెట్ ప్ర తిపాదనలను తగ్గించామని స్పష్టం చేశారు. 2018 శాసనసభ ఎన్నిక ల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తే ఈవీఎంలను ఏదో చేశామని కాం గ్రెస్ నేతలు ఆరోపించారని గుర్తు చేశారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జడ్పీపీ చైర్‌పర్సన్ల పోస్టులు టీఆర్‌ఎస్ గెలుచుకుందన్నారు. ప్రజలు కర్రకాల్చి కాంగ్రెస్ కు వాతలు పెట్టారన్నారు. నీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టినప్పటికీ, అవి కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు.