తెలంగాణ

విష జ్వరాలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీని విధించాలని, ఆసుపత్రుల్లో జ్వర బాధితులకు సరైన వైద్య సహాయం అందడం లేదని ఎఐసీసీ ప్రతినిధి శ్రవణ్ దాసోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ, రాష్ట్రంలో విష జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆరోగ్య రంగానికి రూ.5536 కోట్ల నిధులు కేటాయించారని, మొత్తం నిధుల్లో ఇది 3 శాతమన్నారు. ప్రత్యేక తెలంగాణ వల్ల ప్రయోజనాలను కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తోందన్నారు. ప్రగతిభవన్‌లో ఒక శునకం మరణిస్తే వెటర్నరీ డాక్టర్ నిర్లక్ష్యంపై బంజారాహిల్స్‌పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు.
అదే గాంధీ ఆసుపత్రిలో విష జ్వరాల వల్ల ఆరుగురు బాలలు మరణిస్తే ఎవరు పట్టించుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు సచివాలయాన్ని కూల్చి కొత్త భవనాలు నిర్మించాలన్న ఆత్రుతనే తప్ప మరో ధ్యాస లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాట్లాడుతూ, ప్రగతిభవన్‌లో శునకం మరణిస్తే డాక్టర్‌పై కేసు నమోదు చేయడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు విష జ్వరాలతో చేరి నానా ఇక్కట్లకు గురవుతుంటే, ప్రభుత్వం పట్టించుకోవడం నిజంగా క్రూరమైన చర్యన్నారు.
స్నేహపూర్వక పార్టీకి ప్రతిపక్షమా?
అసెంబ్లీ స్పీకర్‌ను సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే డీ శ్రీ్ధర్ కలిసి తమకు స్నేహపూర్వక పార్టీ అని చెప్పుకుంటున్న మజ్లిస్‌కు ప్రతిపక్ష పార్టీ స్థానం ఎలా కేటాయిస్తారంటూ వినతిపత్రాన్ని సమర్పించారు. మజ్లిస్ పార్టీ, టీఆర్‌ఎస్ పార్టీ మిత్రపక్షాలని చాలా సార్లు ఇరు పార్టీల నేతలు పేర్కొన్నారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలని వారు కోరారు. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ సంప్రదాయాలను పరిరక్షించాలని వారు స్పీకర్‌ను కోరారు.