తెలంగాణ

చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్‌పై కేంద్రానికి సిఫారసు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో త్వరలో నియమించబోయే తొమ్మిది వైస్ చాన్స్‌లర్ పోస్టులలో బీసీలకు జనాభా ప్రకారం 50 శాతం పోస్టులను ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివాం బీసీ ప్రతినిధల బృందంతో కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో త్వరలో నియమించబోయో తొమ్మిది యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్ పోస్టుల్లో జనాభా ప్రకారం బీసీలకు 50 శాతం పోస్టులను కేటాయించాలని గవర్నర్‌ను కోరారు. యూనివర్సిటీ చాన్స్‌లర్ నియమాకంలో జోక్యం చేసుకుని బీసీలకు తగిన కోటాకల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల నియమాకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన న్యాయం జరుగడం లేదని, సమర్ధులైన అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించి అన్యాయం చేశారని ఆరోమించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని గవర్నర్‌కు వివరించారు. అయిన్నప్పటికీ రిజర్వేషన్ల అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందని బీసీలకు తగిన న్యాయం చేయాలని , ఈ మేరకు బీసీలు చేపడుతున్న ఆందోళనల గురించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. ఇటీవల జరిగిన మెడికల్ కౌన్సిలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ అమలులో అక్రమాలు జరిగాయని, సుప్రీంకోర్టు తీర్పుకు విరద్ధంగా, ప్రభుత్వం జీవో 550 వ్యతిరేకంగా రిజర్వేషన్లు అమలు జరుపకుండా ఆన్యాయం చేశారని కృష్ణయ్య ఆరోమించారు.
రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి: గవర్నర్
రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉందని, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కాపాడేందుకు కృషి చేస్తామని గవర్నర్ సౌందర రాజన్ అన్నారు. నాయకులంరూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆమె కోరారు.