తెలంగాణ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేటట్లుగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. శనివారం వారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. నిజాం రజాకార్ల ఆగడాలకు బలైన అమరవీరుల త్యాగనిరతిని ప్రజలకు గుర్తు చేసేందుకు ఒక స్మారక స్థూపాన్ని నిర్మించాలని వారు కోరారు. దీని వల్ల భవిష్యత్తు తరాలకు నిజాం అరాచక పాలన, తెలంగాణ ప్రజలు స్వాతంత్య్రం కోసం చేసిన సాహసపోరాటం తెలుస్తుందన్నారు. గత 20 సంవత్సరాలుగా బీజేపీ పోరాడుతోందన్నారు. మహారాష్ట్ర, కర్నాటకలో ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రాంతాల్లో విమోచన దినోత్సవాన్ని ఘనంగా ఆ రాష్ట్రప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయన్నారు. అనంతరం ఆయన రాజ్‌భవన్ వద్ద విలేఖర్లతో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. అమరుల త్యాగాలను ఎందుకు చిన్న చూపుచూస్తున్నారన్నారు. గతంలో సీఎం రోశయ్య ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదన్నారు. ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 17వ తేదీన పటాన్ చెరులో బీజేపీ భారీ బహిరంగ సభతో పాటు ఊరూరా జాతీయ జెండా ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలను నిర్వహిస్తామన్నారు. మజ్లిస్ స్నేహం కోసమే కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌లు విమోచన దినోత్సవం గురించి మాట్లాడడం లేదన్నారు.