తెలంగాణ

రాష్ట్రంలో కొనసాగుతున్న నయా దోపిడీదారుల పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుర్తి, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన అంతమైన, నయా దోపిడీదార్ల పాలన సాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ఇండియన్ యూనియన్‌లో తెలంగాణ విలీనమై 73ఏండ్లు అవుతున్నందున సాయుధ పోరాటంలో అమరులను స్మరిస్తూ, విలీనదినం ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగ నిర్వహించలనే డిమాండ్‌తో సీపీఐ పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సుయాత్ర శనివారం పాలకుర్తికి చెరుకుంది. పాలకుర్తిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహనికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పూలమాల వేసి ఘనంగ నివాళి అర్పించారు. అనంతరం చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి గడ్డపై పుట్టిన వీర వనిత చాకలి ఐలమ్మ నిజాం తాబేదార్లు, జాగిర్దార్లు, జమిందార్లు, దొరలు, దేఖ్‌ముఖ్, భూస్వాముల విచ్చలవిడి దోపిడి, దౌర్జన్యాలను ప్రశ్నించడమే కాకుండ ఎదురించి పోరాటం చేసిన యోధురాలని కొనియాడారు. ఆకాలంలో దేఖ్‌ముఖ్ గుండాలను ఎదురించడానికి పలుగు-పార, కారం-రోకలి, వరిసెల-బరిసేలను ఆయుధాలుగా మాల్చుకొని తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. భూస్వాముల నుండి ప్రజలకు రక్షణగా కమ్యూనిస్టు పార్టీ అండగ ఉంటు 10లక్షల ఏకరాలు నీరుపెదలకు పంచిపెట్టినట్లు తెలిపారు. ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటన్ని వక్రికరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సెప్టెంబర్17ను అధికారికంగా నిర్వహించాడనికి వెనుకడుగు వెస్తున్నరని, ఆపార్టీలకు ఖాబర్ధార్‌ని హెచ్చరించారు. బీజెపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు తమ పార్టీ కార్యలయంలో సెప్టెంబర్17న జెండావిష్కరణ చేస్తున్నరని, అధికారికంగ నిర్వహించడంలో వెనుకంజ వెస్తున్నరని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్‌పై పెడుతనని ఇచ్చిన మాట తప్పరని, మాట తప్పుతే తెలంగాణ ప్రజలు తిరుగ బడడానికి సిద్ధంగ ఉన్నరన్నరు. భూప్రక్షళణ పేరిట ప్రభుత్వం రైతులను మానోవేదనకు గురి చేస్తున్నరని, భూప్రక్షళణ తప్పుల తడకగ తయారైందని, ప్రభుత్వం విచారణ జరిపించి తప్పులకు పాల్పడ్డ అధికారులపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి నిజాంలు వేసిన హద్దులు ఉన్నయాని, దింతో నిజమైన రైతుకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఐలమ్మ త్యాగలు వృదాగ పోవని, ఈనాటి తరనికి ఆనాటి పోరాట యోధుల త్యాగలను వివరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజీక న్యాయం కోసం ఉద్యమిస్తామనే నినాదంతో సీపీఐ పార్టీ ఈనెల 11నుండి 17వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రను నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్లపెల్లి శ్రీకివాసరావు, జనగామ జిల్లా కార్యదర్శి సీహెచ్. రాజిరెడ్డి, మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు మోదునూరి జ్యోతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయ సారధి, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అనిల్, ప్రజనాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ స్టాలిన్, నాయకులు శ్రీరాములు, సుగుణమ్మ, వెంకటయ్య పాల్గొన్నారు.

*చిత్రం... పాలకుర్తిలో వీరనారి చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు