తెలంగాణ

పని ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ పంచాయతీ కార్యదర్శి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 14: పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యయాత్నానికి పాల్పడిన గుమ్మకొండ జూనియర్ పంచాయితీ కార్యదర్శి స్రవంతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. స్రవంతి భర్త 8నెలల క్రింద ప్రమాదంలో మృతి చెందగా, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శి స్రవంతి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న శనివారం మధ్యాహ్నం జిల్లాలోని పంచాయితీ కార్యదర్శులు నాగర్‌కర్నూల్‌కు చేరుకొని ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అక్కడి నుంచి వారు జిల్లా పంచాయితీ కార్యాయలం వద్దకు చేరుకొని అక్కడ కూడా ధర్నా చేశారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శుల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం నూతన పంచాయితీ చట్టం ప్రకారమంటూ పనిభారం మోపుతూ ఒత్తిడి పెంచుతున్నారని, గ్రామాలలో ప్రజల సహకారం కూడా నామమాత్రంగా ఉందని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవటడంలేదని ఆరోపించారు. తాము విధులకు కొత్తగా వచ్చామని, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, పనిభారం, ప్రజల సహాయ నిరాకరణతో అనేక ఇబ్బందులు పడుతున్నామమన్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలను వారు ప్రస్తావించారు. ఉన్నతాధికారులు వస్తవ పరిస్థితులను గుర్తించి పనిభారం లేకుండా చూడాలని, సాధ్యమైనంత వరకు తాము కష్టపడి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని, కాని ఒత్తిడి మాత్రం తేకుంటే బాగుండేదన్నారు. ఇది ఇలా ఉండగా డీపీవోకు ఇచ్చిన వినతిపత్రంలో ఆత్మహత్యకు పాల్పడిన స్రంవతి కుటుంబానికి తక్షణమే రూ.15లక్షలు పరిహారం ఇవ్వాలని, తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పిల్లలు అనాధలుగా ఉన్నారని, వారి చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.
*చిత్రం... నాగర్‌కర్నూల్‌లో పంచాయతీ కార్యదర్శుల ర్యాలీ