తెలంగాణ

మళ్లీ మళ్లీ నేనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ రాష్ట్రానికి మరో రెండు టెర్మ్‌లు సీఎంగా తానే ఉంటానని, తక్కువలో తక్కువ మరో మూడు టెర్మ్‌లు టీఆర్‌ఎస్ గెలిచి తీరుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తనకు చాలా మంది మిత్రులు ఉన్నారని, కేసీఆర్ ఆరోగ్యం ఖతం అయ్యిందట కదా..అమెరికాకు పోతాడట కదా అని ప్రచారం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. 20 ఏళ్లుగా అదే ప్రచారం చేస్తున్నారని, 20 ఏళ్లయినా తాను చావలేదని కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఇపుడు కూడా తనకు ఏం కాలేదని కేసీఆర్ అన్నారు. ఇపుడు కేసీఆర్ దిగిపోయి...కేటీఆర్‌ను సీఎం చేస్తాడని కొందరు తన
గురించి ప్రచారం చేస్తున్నారని, తానెందుకు కేటీఆర్‌ను సీఎంను చేస్తానని ప్రశ్నించారు. కనిష్టంగా మరో టెర్మ్‌లు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉంటుందని, తన ఆరోగ్యం బాగుందని, మరో రెండు టెర్మ్‌ల వరకూ బతికే ఉంటానని అన్నారు. ఇపుడు తనకు 66 ఏళ్లని, ఇంకో పదేళ్లన్నా సీఎంగా చేయనా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరు ఎన్ని శాపాలు పెట్టినా గట్టిగానే ఉంటానని అవన్నీ దీవెనలుగా పనిచేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
కొన్ని విషయాలు పూర్తిగా బయటకు చెప్పలేమని, ఇంటి గుట్టు బయటపెట్టుకోవద్దని, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని సీఎం అన్నారు. సీతారామ ప్రాజెక్టు, దేవాదుల, కాళేశ్వరం ద్వారా 570 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని అన్నారు. గోదావరి సజీవంగా ఉంటుందని, అన్నీ సక్రమంగానే జరుగుతాయని అన్నారు. ఉత్తమ సలహాలు ఎవరు ఇచ్చినా స్వీకరిస్తామని చిల్లర రాజకీయాల కోసం శాపాలు పెట్టవద్దని సీఎం సూచించారు. అసత్య ప్రచారం చేస్తుంటే తనకు చాలా బాధ కలుగుతోందని, అసత్య ప్రచారం భరించలేక శనివారం నాడు శానసభలో తాను పరుషపదజాలాన్ని వినియోగించిన మాట నిజమేనని, దానికి తాను చింతించానని, అలా మాట్లాడకపోయి ఉండాల్సిందని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం బహుళార్ధ ప్రాజెక్టు అని, దాని వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, దానిపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు.