తెలంగాణ

మాంద్యం ఉన్నా.. మాట తప్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఉందని, ఆర్ధిక పరిస్థితిపై ఎలాంటి భేషజాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు దాపరికాలు లేకుండా వాస్తవ స్థితిగతులు అన్నింటినీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పానని, మాంద్యం ఉందని మాట తప్పేది లేదని, అన్ని పథకాలనూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆదివారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా బదులిచ్చారు. రెండున్నర గంటలకు పైగా మాట్లాడిన కేసీఆర్ అనేక అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక పరిస్థితితో పాటు వివిధ రంగాల్లో జరిగిన ప్రగతిని, పురోగతిని, ప్రణాళికలను వివరించారు. సభలో కొంత మంది సభ్యులు కొన్ని సూచనలను చేశారని, కొన్ని విమర్శలను చేశారని, దేశంలో ఆర్థిక
మాంద్యం కొనసాగుతోందని, దాని పరిణామాలు ఏఏ రంగాలపై ఏ విధంగా ఉందనే విషయం తాను చెప్పానని, ముఖ్యమంత్రిగా తాను చెప్పడమే కాదని, పత్రికల్లో అనునిత్యం వస్తోందని అన్నారు. రాజకీయ విమర్శలు పక్కన పెడితే విశే్లషకులు, ఆర్థిక గణాంక శాస్తవ్రేత్తలు, జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులు, ఇటీవలి కాలంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సలహాదారులుగా పనిచేసిన వారు అంతా ఈ విషయం చెబుతున్నారని అన్నారు. ఆర్థిక మాద్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, దేశం కాబోతోందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని అన్నారు. ఆనంద్ మహేంద్ర లాంటి వారు మూడేళ్లుదాకా కోలుకోలేమని చెబుతున్నారని, ఆర్ధిక నిపుణుల విశే్లషణలను దృష్టిలో ఉంచుకునే బడ్జెట్‌ను రూపొందించామని అన్నారు. ప్రగతి నిరోధక శక్తులు కొన్ని అడ్డుపడినా, వాటిని అధిగమించి 25 శాతం వృద్ధి రేటు సాధించామని, గత ఏడాదిన్నర నుండి ఏ త్రైమాసికంగాలో ఎంత తగ్గిందో కూడా చెప్పామని అన్నారు. దేశాన్ని సాకే ఆరేడు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని సీఎం చెప్పారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా సమైక్యవాదులు ముందు ఏదైతే వాదించామో వంద శాతం దానిని నిజం చేశామని, దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు.
రాష్ట్ర రుణభారం పెరిగిందని విపక్షాలు చెబుతున్నాయని, రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనం మార్చుకోవాలని నీతి ఆయోగ్‌లో చెప్పామని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం మార్చుకోవాలని కేసీఆర్ అన్నారు. తాము అభివృద్ధి చెందిన దేశాలను అనుసరిస్తున్నామని, అంటే ఒక బాధ అనకుంటే ఒప్పుకున్నట్టు అవుతుందని, పరిగెత్తే వాళ్ల కాళ్లలో కట్టె పెట్టొద్దని ప్రధానికి తాను ముందే చెప్పానని, పరిగెత్తే అవకాశం ఉన్న వారిని ఎందుకు ఆపాలని సీఎం ప్రశ్నించారు. ప్రజలకు లేనిపోని భయోత్పాతాలను సృష్టించే ప్రయత్నం చేయవద్దని, పిల్లలు గూటంలా ఉండాల్నంటే గుమ్మిలో వడ్లు ఖతం కావాలని, మనకు అందుబాటులో ఉన్న వనరులను వాడుకోకపోతే అది అవివేకం అవుతుందని అన్నారు.
తాము జపాన్, అమెరికా, చైనా, యురోపియన్ యూనియన్ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాన్ని పాటిస్తున్నామని అన్నారు. ప్రపంచంలో ఎక్కువ అప్పులున్నది అమెరికా, జపాన్‌లకే వారేమీ అవివేకులు కాదని, అంతఘనం అప్పులున్న అమెరికా, జపాన్ దేశాలు ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నాయని ప్రశ్నించారు. కొన్ని కొన్ని శాఖలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని, ఆ గ్యారంటీల ప్రకారం ఆయా కార్పొరేషనే్ల చెల్లించుకుంటాయని, మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయిస్ వంటి వాటికి గ్యారంటీ ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుందని, రెండు పంటల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న అప్పు తీరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతులు అంచు ధోతీ కట్టుకునే రోజులొస్తాయని చెప్పారు. కాళేశ్వరంపై పూర్తిగా వక్రీకరిస్తుంటే తనకు బాధ అనిపిస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరు ప్రజలు అందరికీ తెలియాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరానికి నాటుపడవల్లో వెళ్లి మోటు పాటలన్నీ పాడారని, సంపద ఎలా పంచుకోవాలో ప్రభుత్వాలకు తెలియాలని అన్నారు. కొన్ని రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుకోవడం లేదని, అప్పుల గురించి ప్రతిపక్షాలు బెంబేలెత్తాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంత వరకూ ఏ ఫైనాన్స్ సంస్థకూ ప్రభుత్వం రూపాయి కూడా డిఫాల్టు కాలేదని, 25 ఏళ్లకు తిరిగి ఇస్తామన్న బాండ్లును కూడా ఆర్‌బీఐ స్వీకరించిందని చెప్పారు. ఆర్ధిక మాంద్యం ఉందని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఏ రోటికాడ ఆ పాట పాడుతోందని, మంథనీ నీళ్లు, బాన్స్‌వాడ నీళ్లు అని వేర్వేరుగా ఉంటాయా ? మా నీళ్లు మీ నీళ్లు అని కాంగ్రెస్ నాయకులు చీప్‌గా ధర్నాలు చేస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో మతకలహాలు, కర్ఫ్యూలు, చేనేతల ఆత్మహత్యలు వర్థిల్లాయని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పచ్చబడేలా చేస్తే తామే వచ్చి ఎండగట్టామా అని ప్రశ్నించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదని సీఎం పేర్కొన్నారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా నిర్మించి తీరుతామని చెప్పారు. తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఎబ్‌ప్లాన్ మళ్లించామని పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధుల్లో ఖర్చు పెట్టిన ప్రతి పైసాకూ లెక్కుందని అన్నారు. దళితులను ఆదుకునే విషయంలో తెలంగాణ ఛాంపియన్ కావాలని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ అనేది ఎథికల్ అంశమని, పేరు ఏదున్నా బడ్జెట్ అదే ఉంటాదని అన్నారు. ఆస్పత్రుల్లో మందుల కొనుగోలుకు 146 కోట్లు కేటాయించామని, కిడ్నీ బాధితులకు 40 డయాలసిస్ సెంటర్లు పెట్టామని, అమ్మ ఒడి పథకం అమలుచేస్తున్నామని, రైతుబంధు, రైతు భీమా అమలుచేస్తున్నామని అన్నారు.
రుణమాఫీ నిధులు ఇక రైతులకే
రుణమాఫీ నిధులు ఇక బ్యాంకులకు కాకుండా నేరుగా రైతుల ఖాతాలకే జమ చేసే ఆలోచన చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

*చిత్రం...శాసనసభలో బడ్జెట్‌పై మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు