తెలంగాణ

అందరి అంగీకారంతోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అందరి అంగీకారంతోనే నదుల అనుసంధానానికి ఒప్పందం కుదుర్చుకుంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభలో ప్రకటించారు. ఆలోగా నదుల అనుసంధానంపై ఏవైనా సందేహాలు ఉంటే చూసి రావడానికి ప్రభుత్వమే హెలిక్యాప్టర్ సమకూరుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను (డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) కోరిన సభ్యులకు ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై సభ్యుల సందేహాలకు సమాధానం ఇస్తూ ఆదివారం మూడు గంటలపాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డను ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనని సీఎం కేసీఆర్ సమర్దించుకున్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మించడం వల్ల ఏడాది పొడవున నీటి లభ్యత ఉంటుందని వివరించారు. దుమ్ముగూడెం నుంచి గోదావరి నీటిని కృష్ణకు తరలించాలని యోచిస్తున్నామన్నారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌కు చేర్చి వాటిని నల్లగొండ, పాలమూరు, వికారాబాద్ వరకు తరలించి దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. అలాగే ఆంధ్రప్రాంతానికి పోతిరెడ్డిపాడు, దిగువన నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించే అవకాశం ఉంటుందన్నారు. అందరి అంగీకారం తర్వాతనే ఇరు రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానికి ఓప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఈ ఒప్పందంపై ప్రతిపక్షాలతో కూడా సంతకం చేయిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించిన ఇందిరాసాగర్‌ను నిర్మిస్తే పోలవరం ప్రాజెక్టు వల్ల నీట మునుగుతుందని ఇంజనీరింగ్ నిపుణులు
చెప్పారన్నారు. అలాగే కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించిన తమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ వద్దనే నీట లభ్యత ఎక్కువ ఉంటుందని గుర్తు చేశారు. తుమ్మిడిహట్టి కూడా వదలిపెట్టకుండా అక్కడ మరో బ్యారేజి నిర్మించి రెండు లక్షల ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. దీనిపై ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ నిపుణులను వెంటబెట్టుకొని వెళ్తామంటే సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్కకు ప్రభుత్వమే హెలిక్యాప్టర్ సమకూరుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) సభ్యులకు ఇవ్వడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే అది ఎక్కువ పేజీలు ఉండటంతో దానిని అడిగిన సభ్యులకు మాత్రమే అందజేస్తామన్నారు. దీనిని ఇప్పటికే భట్టి విక్రమార్క అడగడంతో ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశిస్తున్నట్టు చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో ఆపలేమన్నారు. పోలవరం ఎత్తుపై ప్రతిపక్షాలతో చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కూడా చెప్పానన్నారు. ఎత్తు విషయంలో భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు.

కేసీఆర్ కలకాలం బాగుండాలనే కోరుకుంటాం: భట్టి
సీఎం కేసీఆర్ కలకాలం ఆరోగ్య ఉండాలని, ఆయన పరిపాలనలో రాష్ట్రానికి మేలు జరగాలనే కోరుకుంటున్నామని భట్టి విక్రమార్క అన్నారు. కొంత మంది మిత్రులు తనకు ఆరోగ్య బాగా లేదని ప్రచారం చేస్తున్నారని అంతకుముందు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తామెవ్వరికీ అలాంటి ఆలోచన లేదన్నారు.