తెలంగాణ

రైతు బీమా కింద రూ.813.10 కోట్ల చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో సహజంగా లేదా ఇతర కారణాల వల్ల మరణించిన ఐతుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని సమకూర్చేందుకు గత ఏడాది ఆగస్టు 14వ తేదీ నుంచి రైతు బీమా స్కీంను అమలుచేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆదివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన బదులిస్తూ 2018-19లో రూ.813.10 కోట్లను చెల్లించామని, ఇంతవరకు 16,265 కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. గత ఏడాది ప్రీమియం నిమిత్తం రూ.710, ఈ ఏడాది రూ.1071ను చెల్లించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 345 గోదాముల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా, ఇంతవరకు 331 గోదామల నిర్మాణం పూర్తి చేసినట్లుమంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మొత్తం 17.50లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను గోదాముల్లో నిల్వ చేసినట్లు ఆయన చెప్పారు.