తెలంగాణ

నిజమైన విముక్తి సెప్టెంబర్ 17 కాదు.. జూన్ 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ ప్రజలకు నిజమైన అసలు సిసలు విముక్తి సెప్టెంబర్ 17న కాదని, జూన్ 2వ తేదీనేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆదివారం నాడు ముఖ్యమంత్రి బదులిస్తూ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం గురించి కూడా మాట్లాడారు. కొత్తగా మతం స్వీకరించిన వాడికి నామాలు ఎక్కువగా ఉంటాయని ఎద్దేవా చేస్తూ దీనిపై కొంత మంది అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17న ప్రతి ఏటా తెలంగాణ భవన్‌పై తాము జాతీయ జండాను ఎగురవేస్తున్నామని, ఎగురవేస్తునే ఉంటామని పేర్కొన్నారు. ఆ రోజు ఎవరిపైనా ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఎవరు ఏం చేయదల్చుకుంటే అది చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆరోజు రాచరికం నుండి ప్రజాస్వామ్యం వైపు పయనించిన రోజనని కనుక అందరూ జెండా ఎగురవేయవచ్చని చెప్పారు. నిజాంకు రాజ్ ప్రముఖ్ అనే బిరుదు ఇచ్చి గవర్నర్‌ను చేసింది వల్లభాయ్ పటేల్ కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేల మంది అమాయకులను ఊచకోతకు గురిచేశారని, కమ్యూనిస్టు పోరాట యోధులను పట్టపగలు పట్టుకుని కాల్చి చంపారని , మాజీ హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి తండ్రిని తుపాకితో కానిస్టేబుల్ కాల్చి చంపారు.
జనరల్ జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో రెండేళ్లపాటు క్రూరాతి క్రూరమైన మిటలరీ పాలన కొనసాగింది. వేదనకు గురైన తెలంగాణ గురించి పట్టించుకోకుండా లెఫ్టిస్టులు, రైటిస్టులు రాజకీయాలు చేయాలని చూశారే తప్ప ప్రజల బాధలను ఎన్నడూ పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కూడా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశానని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సమకాలీన పరిస్థితులు చూసిన తర్వాత పాత గాయాలను రేపవద్దని మేథావులు చేసిన సూచన మేరకు దానిని పక్కన పెట్టామని అన్నారు. 1948లో నిజాం పాలన నుండి మిలటరీ పాలన నుండి బయటపడ్డామో లేదో 1956లో ఆంధ్రాపాలనలో విలీనం అయ్యామని, పెనం మీద నుండి పోయ్యలో పడ్డట్టు తెలంగాణ పరిస్థితి తయారైందని, 60 ఏళ్ల9 పోరాటం యాతన తర్వాత 2014 జూన్ 2న నిజమైన తెలంగాణ విముక్తి లభించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇంత వరకూ శాంతియుతంగా ఉన్న తెలంగాణ ప్రశాంతతకు భంగం కలిగించినట్టయితే ఉక్కుపాదంతో అణచివేస్తామని ఆయన హెచ్చరించారు.