తెలంగాణ

టీఆర్‌ఎస్‌లో త్వరలో భారీ విస్పోటనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 16: సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న నియంతృత్వ, నిరంకుశ విధానాల వల్ల అధికార టీఆర్‌ఎస్‌లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి బద్ధలై త్వరలోనే ఆ పార్టీలో భారీ విస్ఫోటం జరగనుందని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ నుండి హైదరాబాద్‌కు వెళ్తూ సోమవారం జిల్లాకేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ పోకడలతో గులాబీ నేతలు రగిలిపోతున్నారని, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారిని విస్మరించి కొత్తవారికి ప్రాధాన్యత కల్పించడం లాంటి ఒంటెద్దు పోకడలతో అసమ్మతి జ్వాలలు లావాలా జనిస్తున్నాయని, ఇటీవల కొందరు నాయకులు బహిరంగ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీలో అణచివేత ఎంత పెరిగిపోతుందో అసమ్మతి జ్వాలలు కూడ అదేస్థాయిలో పెరిగిపోతున్నాయన్నారు. త్వరలో జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయసమేనని ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతోందని ఈ పరిస్థితుల్లో జరిగే ఈ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనించి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో గెలుపు కోసం చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ మంత్రి పదవికి ఉన్న హుందాతనాన్ని దిగజారుస్తున్నాడని మండిపడ్డారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటిలోకి దింపుతున్నాడన్నారు.