తెలంగాణ

యురేనియంతో ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : నల్లమలతో సహా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా యురేనియం తవ్వకాలు జరిపేందుకు అనుమతించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర శాసనసభ సోమవారం నాడు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏకగ్రీవంగా శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రభుత్వం తరఫున మున్సిపల్ వ్యవహారాల మంత్రి కే. తారకరామారావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పర్యావరణం, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికితీయడం కోసం తవ్వకాలు జరపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పెద్ద పులులు, చిరుతపులులు, చుక్క జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, నీల్గాయి సహా అనేక జాతుల జంతుజాలం నల్లమల అడవి ఆధారంగానే మనుగడ సాగిస్తున్నాయి. అరుదైన ఔషధ మొక్కలతోపాటు లక్షలాది రకాల వృక్షజాలం ఆ అడవిలో ఉంది. అనాదిగా అడవినే ఆధారం చేసుకుని జీవించే చెంచులు తదితర జాతుల ప్రజలు ఉన్నారని, ఇదే అడవిలో ఎతె్తైన కొండలు, గుట్టలు ద్వారా పారే జలపాతాలు కృష్ణా నదికి పరీవాహకంగా ఉన్నాయని, మొత్తంగా జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని శాసనసభ పేర్కొంది. మానవాళితోపాటు సమస్త ప్రాణకోటి మనుగడకు ముప్పుగా పరిణమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, యురేనియం నుండి వెలువడే అణు ధార్మికత వల్ల పంట భూములు, పీల్చే గాలి, తాగే నీరు కాలుష్యమై మనిషి జీవితం నరకప్రాయం అవుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిపిన యురేనియం తవ్వకాలు అనుభవాలు కూడా చేదుగానే ఉన్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపడాన్ని యావన్మంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సభ పేర్కొంది. జీరో అవర్ విరామం తర్వాత శాసనసభ తిరిగి సమావేశం కాగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం సవరించిన తీర్మానం ప్రతిపాదిస్తోందని అన్నారు. స్పీకర్ ఆదేశాల మేరకు కేటీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, ‘నల్లమల అటవీ ప్రాంతంతో పాటు రాష్ట్రంలోనే ఏ ప్రాంతంలో కూడా యురేనియం నిక్షేపాల తవ్వకాల కోసం అనుమతించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని శాసనసభ కోరుతోంది’ అని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేయవద్దంటూ ప్రజలు, ప్రజాసంఘాలు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తొలుత నల్లమల అటవీ ప్రాంతంలోనే తవ్వకాలు జరపవద్దని కోరుతూ తీర్మానం రూపొందించామని, అయితే ఈ తీర్మానంలో మార్పులు చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా యురేనియం కోసం తవ్వకాలకు అనుమతి ఇవ్వవద్దంటూ కేంద్రాన్ని కోరుతూ తీర్మానం రూపొందించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ తీర్మానాన్ని రూపొందించామని, అందుకు కేసీఆర్‌కు ఈ సభ ధన్యవాదాలు తెలియజేస్తోందని అన్నారు. అన్ని పక్షాలు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు ఖాద్రీపాషా, టీఆర్‌ఎస్ సభ్యుడు రవీంద్ర కుమార్ తదితరులు ఆయా పార్టీల తరఫున మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానానికి మద్దతు తెలుపుతున్నామని అన్నారు.