తెలంగాణ

యురేనియంపై పార్లమెంట్‌లో లేవనెత్తండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: యురేనియం తవ్వకాల అంశంపై పార్లమెంట్‌లో లేవనెత్తాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పార్టీ ఎంపీలకు సూచించారు. యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని శాసనసభలో తీర్మానం చేసిన నేపథ్యంలో సోమవారం నాగర్‌కర్నూల్ ఎంపీ పి రాములు కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావ్యతిరేక చర్యలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కొద్ది రోజులుగా చేస్తున్న విమర్శలకు చెంపపెట్టుగా శాసనసభలో తీర్మానం చేశారన్నారు. యురేనియం అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని కేటీఆర్ సూచించినట్టు రాములు తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలు కూడా తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
*చిత్రం...యురేనియం తవ్వకాలకు అనుమతించేది లేదని శాసన సభలో తీర్మానం చేయడంపై మంత్రి
కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎంపీ రాములు