తెలంగాణ

పురపాలనలో పౌరుడే పాలకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: పురపాలనలో పౌరుడే పాలకుడని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా, పారదర్శకమైన పాలనను అందిస్తూ, ప్రజలకు అవసరమైన సేవలను మెరుగుపర్చటమే లక్ష్యంగా సరికొత్త మున్సిపల్ యాక్ట్‌ను తీసుకురానున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. కొత్త మున్సిపల్ యాక్టుపై రెండురోజులుగా మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సు మంగళవారం ముగిసింది. మంగళవారం సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పాత చట్టంతో పోల్చితే నూతన చరట్టంలో వచ్చిన సంస్కరణలు, మార్పులు, నిబంధనలపై ఈ రెండు రోజుల పాటు పురపాలక శాఖ నిపుణులతో టౌన్‌ప్లానింగ్ ఆదాయం, పాలన సంస్కరణలు వంటి అంశాలపై చర్చించి, పురపాలనలో ప్రభుత్వ విజన్‌పై అధికారులకు
దిశానిర్దేశం చేశారు. ప్రజలకు పౌరసేవలను పారదర్శకంగా అందించటమే లక్ష్యంగా ఈ చట్టం పనిచేస్తుందని వివరించారు. ప్రజల కోసం, పౌరసేవల కోసం, పరిపాలన కోసం నూతన చట్టం అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఓ వ్యక్తికేంద్రీకృతంగా ఉన్న పాత చట్టం స్థానంలో వ్యవస్థ కేంద్రీకృతంగా సరికొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజలతో మమేకమై తన రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజలకు, పాలనకు అవసరమైన అన్ని సంస్కరణలను ఈ చట్టం ద్వారా తీసుకురానున్నట్లు తెలిపారు. 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేకుండా చేయటం, భవన నిర్మాణాల కోసం సెల్ఫ్ సర్ట్ఫికేషన్ వంటి నూతన నిబంధనలను తీసుకురానున్నట్లు తెలిపారు. పరిపాలన ఫలాలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందించేందుకు వీలుగా మున్సిపల్ కమిషనర్లు పనిచేయాలని ఆయన సూచించారు. ప్రణాళికాభివృద్ధికి ప్రతి ఒక్కరం కలిసిమెలిసి, చక్కటి సమన్వయంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు కోరుకుంటున్న పారిశుద్ధ్యం, గుడ్ గవర్నెన్స్, వేగవంతమైన సేవలను పారదర్శకంగా అందించేందుకు ఈ చట్టం తోడ్పడుతోందన్నారు. రానున్న వారం రోజుల్లో మున్సిపల్ కమిషనర్లు ఈ నూతన చట్టంపై తమ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పురపాలనలో విస్త్రృతమైన అనుభవం ఉన్న కమిషనర్లు, చట్టంలో లేని వినూత్నమైన పద్దతులను పనిచేసి పట్టణాలకు మరింత శోభ తీసుకువస్తామంటే తాము తప్పకుండా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో సిద్ధిపేట, సిరిసిల్లా, వరంగల్, సూర్యపేట, ఫీర్జాదిగూడ వంటి మున్సిపాల్టీల్లో వివిధ అంశాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా పనిచేస్తున్నాయని, వాటిని పరిశీలించాలని మంత్రి కమిషనర్లకు సూచించారు. దీంతో పాటు జాతీయ స్థాయిలో పురపాలనలో వినూత్నమైన, ఆదర్శవంతమైన పద్దతులను అనుసరిస్తున్న పట్టణాలను అధ్యయనం చేసేందుకు వేళ్తామంటే తాము పంపేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి వివరించారు. పురపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా పారదర్శకత మరింత పెరుగుతుందని, కమిషనర్లు సోషల్ మీడియాని వినియోగించుకుంటూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. ప్రతి మూడు నెలలకోసారి రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వివిధ అంశాల్లో ఉత్తమ సేవలు అందించిన పురపాలక సంఘాల కమిషనర్లకు ఈ సందర్భంగా మంత్రి పురస్కారాలను అందజేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, సీడీఎంఏ శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.

*చిత్రం... మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి సదస్సు ముగింపులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ తదితరులు