తెలంగాణ

శాసనసభ ముందుకు మున్సిపల్ సవరణ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ‘‘తెలంగాణ మున్సిపాలిటీస్ బిల్లు-2019’’ ని (సవరించిన) ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. మున్సిపల్ వ్యవహారాల మంత్రి కేటీఆర్ ఈ బిల్లును మంగళవారం శాసనసభ ముందు ఉంచారు. వాస్తవానికి తెలంగాణ మున్సిపల్ బిల్లు-2019 కి శాసనసభ ఆమోదం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 2019 జూలై 18,19 తేదీల్లో శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. జూలై 19న శాసనసభ ఆమోదం తీసుకుని గవర్నర్‌కు పంపించారు. అయితే ఈ ఇందులో కొన్ని మార్పులు చేయాలంటూ ఆనాటి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బిల్లును జూలై 21 న ప్రభుత్వానికి తిప్పి పంపించారు. పురపాలికల ఎన్నికల తేదీలను ఖరారు చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కే ఉండాలని, ఈ అధికారం ప్రభుత్వం తీసుకోరాదని గవర్నర్ సూచించారు. ఆయన చేసిన సూచనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జూలై 21 న ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ ఆర్డినెన్స్ స్థానంలో తాజాగా బిల్లు ప్రవేశపెడుతున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ పురపాలికల చట్టం-1965, తెలంగాణ పురపాలక కార్పొరేషన్ల చట్టం-1994 లను రద్దుచేస్తూ కొత్తగా తెలంగాణ పురపాలికల చట్టం-2019 ను రూపొందించామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలు ఏర్పాటవుతున్నాయి. ఈ బిల్లుకు శాసనసభ, ఆమోదం లభించిన తర్వాత తిరిగి గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తారు. గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత ఇది చట్టంగా మారుతుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్టగ్రెజిట్‌లో పొందుపరుస్తారు.