తెలంగాణ

ఇది ట్రైలరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ‘ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చూస్తున్నది ట్రైలర్ మాత్రమే. మున్ముందు పూర్తి సినిమా చూపిస్తాం’ అని శాసనసభలో మంగళవారం కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చురుక అంటించారు. మున్సిపల్ పద్దుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యు డు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, మూసీ
నది ప్రక్షాళనపై మంత్రి కేటీఆర్ తమకు 70 ఎంఎం సినిమా చూపించారని, అది ఏమైందో ఇంతవరకు అతీగతి లేదన్నారు. నల్లగొండ జిల్లాలో మూసీనది పరివాహక ప్రాంతలో నీటి కాలుష్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీపై తమకు చూపించిన ట్రైలర్‌కే పరిమితమా? అని ఆయన కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు శ్రీ్ధర్ బాబు కూడా ప్రస్తావించారు. వీరి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ ‘మీరు ఇప్పటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమే, మున్ముందు అసలు సినిమా చూపిస్తాం’ అని దెప్పిపొడవటంతో సభ గొల్లుమంది.

*చిత్రం... మంత్రి కల్వకుంట్ల తారక రామారావు