తెలంగాణ

వ్యవసాయ వర్సిటీలో సదస్సుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘‘యూత్ యాజ్ ఏ టార్చ్ బేరర్స్ ఫర్ బిజినెస్ ఓరియెంటెడ్ అగ్రికల్చర్’’ పేరుతో 2019 అక్టోబర్‌లో నిర్వహిస్తున్న సద్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను సేద్యం వర్సిటీ వైస్-్ఛన్సలర్ డాక్టర్ వి. ప్రవీణ్‌రావు ఆహ్వానించారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల తరహాలోనే సేద్యం వర్సిటీకి గవర్నర్ పదవిరీత్యా ఛాన్సలర్‌గా కూడా ఉంటారు. తమిళిసైని మర్యాదపూర్వకంగా ప్రవీణ్‌రావు రాజ్‌భవన్‌లో మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీ ఏర్పడ్డప్పటి నుండి సాధించిన ప్రగతి గురించి ఆయన గవర్నర్‌కు వివరించారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో వర్సిటీ సాధించిన ప్రగతిని నివేదించారు. రైతుల ఆదాయం రెట్టింపుచేసే విషయంలో వర్సిటీ తీసుకున్న చర్యల గురించి గవర్నర్‌కు వివరించారు.