తెలంగాణ

గవర్నర్‌ను కలిస్తే సమాచారం ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: గవర్నర్‌ను కలుస్తున్నట్టు తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎల్పీ సభ్యుడినైన తనకు కూడా గవర్నర్‌ను కలిసే సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏకపక్షంగా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన చెప్పారు. బుధవారం శాసనసభకు వచ్చిన రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. శాసనసభలో విద్యుత్ పద్దుపై చర్చ సందర్భంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో విద్యుత్ అంశం హాట్ టాపిక్‌గా మారినా తమ ఎమ్మెల్యేలకు పట్టలేదన్నారు. ఈ విషయాన్ని అడగటానికే తాను శాసనసభకు వచ్చానన్నారు. విద్యుత్‌పై ప్రభుత్వం ఏకపాత్రాభినయం చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు సభలో లేకపోతే ఏం సందేశం ఇచ్చినట్టని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎవరినీ ఎంపిక చేయలేదన్నారు. అక్కడి అభ్యర్థిగా తాను కిరణ్‌రెడ్డిని ప్రదిపాదిస్తున్నట్టు ఆయన తెలిపారు. కిరణ్‌రెడ్డి ఒక్కరే స్థానిక అభ్యర్థి అని
రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, పీసీసీ ఏర్పాటు చేసిన యురేనియం తవ్వకాల వ్యతిరేక కమిటీ చైర్మన్ వీ హనుమంతరావు ఆహ్వానం మేరకే జనసేన పార్టీ అధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి తాను వెళ్లాలని చెప్పారు. అక్కడికి ఎందుకు వెళ్లావంటూ తనను వ్యతిరేకించిన సంపత్‌కుమార్ మరి ఎందుకు వచ్చారని రేవంత్ ప్రశ్నించారు. యురేనియం గురించి సంపత్‌కుమార్‌కు ఏబీసీడీలు కూడా తెలియవని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌తో సెల్ఫీ దిగడానికి అవకాశం రాలేదన్న కోపాన్ని సంపత్ తనపై చూపిస్తే ఏమి లాభమని ప్రశ్నించారు. ఏఐసీసీ కార్యదర్శులుగా ఉండి మహారాష్టల్రో ఎన్నికలు వదిలిపెట్టి సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డికి ఇక్కడేమి పని అని రేవంత్ ప్రశ్నించారు. యురేనియం తవ్వకాలపై తాను టీడీపీలో ఉన్నప్పటి నుంచి పోరాటం చేశానని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

*చిత్రం... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి