తెలంగాణ

కొత్త సచివాలయంపై నివేదికలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి మంత్రుల స్థాయి కమిటీ, సీనియర్ అధికారులతో కూడిన సాంకేతిక కమిటీల నివేదికలు అందాయని రవాణా, రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం నాడు శాసనసభలో చెప్పారు. మహ్మద్ మోజాం ఖాన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ కొత్త సచివాలయ నిర్మాణం విషయమై మంత్రిమండలి ఉపసంఘం నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. ప్రస్తుత సచివాలయంలో దేవాలయాలు కాకుండా రెండు మసీదులున్న మాట వాస్తవమేనని , సదరు మతపరమైన నిర్మాణాలను కదపకుండా కొత్త సచివాలయ భవన సముదాయాన్ని డిజైన్ చేసే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. అంతకుముందు ఎంఐఎం సభ్యుడు మోజాంఖాన్ మాట్లాడుతూ సచివాలయ నిర్మాణం పేరుతో మతపరమైన సంస్థల వద్దకు వెళ్లకుండా ఆపుతున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని అన్నారు. రెండుమూడేళ్లు నిర్మాణాలు చేపడితే అంత వరకూ మసీదులు వద్దకు వెళ్లకుండా ఆపేస్తారా? అని నిలదీశారు. సభా ముఖంగా దీనిపై మంత్రి ఖచ్చితమైన హామీ ఇవ్వాలని పేర్కొన్నారు. మసీదులను ఉన్నచోటనే కొనసాగిస్తూ కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని వాటిని కదిపేందుకు వీలు లేదని మోజాం ఖాన్ పేర్కొన్నారు. తొలి నుండి తాము టీఆర్‌ఎస్ పార్టీకి అన్ని విధాల మద్దతు ఇస్తున్నామని, మత పరమైన మనోభావాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఆ పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఉందని అన్నారు. ఒక దశలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని, వారికి పరిస్థితిని వివరించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డికి సూచించారు. చాలా సేపు ఎంఐఎం సభ్యుడు సభా ముఖంగా సమాధానం చెప్పాలని పట్టుబట్టినా, తర్వాత మంత్రి సమాధానంతో పరిస్థితి ప్రశాంతంగా మారింది.